ఒకే సమాధిలో పదుల్లో మృతదేహాలు...అయినా రెండ్రోజులు శవంతోనే జాగారం

By Arun Kumar PFirst Published Jun 13, 2021, 9:56 AM IST
Highlights

రెండు రోజులు శ్మశానవాటిక వద్ద పడిగాపులు కాసినా అంత్యక్రియలు చేయకుండానే వెనుదిరగాల్సింది వచ్చిన పరిస్థితి ఓ  ఓ కుటుంబానికి ఎదురయ్యింది.  

హైదరాబాద్: పేరుకే మహానగరాలు... అక్కడ బ్రతకడమే కాదు చచ్చినా ఇబ్బందులు. రోజురోజుకు జనాలు పెరిగినా స్థలం మాత్రం పెరగదు కదా... దీంతో గూడు కోసం ఇబ్బందిపడేవారు కొందరయితే... చివరకు చనిపోయినా పూడ్చిపెట్టడానికి స్థలం దొరక్క ఇబ్బందిపడేవారు మరికొందరు. ఇలా అయినవారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న కుటుంబం శవాన్ని పూడ్చిపెట్టడానికి ఇబ్బందిపడ్డ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

నగరానికి చెందిన ఓ క్రైస్తవ కుటుంబంలో ఒకరు చనిపోయారు. అతడి అంత్యక్రియలను నారాయణగూడ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్లారు. అయితే శ్మశానవాటికలో స్థలాభావం వల్ల ఒకే కుటుంబానికి చెందినవారిని  ఒకే సమాధిలో పూడ్చిపెడుతున్నారు. ఈ క్రమంలోనే సదరు కుటుంబం తమవారి సమాధి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఇలా రెండురోజుల వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కొత్తగా గుంత తీసి పూడ్చి పెట్టేందుకు అనుమతివ్వాలని  ప్రొటెస్టంట్‌ సిమెట్రీ సిబ్బందిని అభ్యర్థించినా అనుమతించలేదు. 

read more  పాత గొడవలు... స్నేహితుల చేతిలో పండ్ల వ్యాపారి దారుణ హత్య?

ఇలా రెండు రోజులు శవంతో జాగారం చేసినా అంత్యక్రియలు చేయకుండానే వెనుదిరగాల్సింది వచ్చింది. 8 ఎకరాల విస్తీర్ణం వున్న శ్మశాన వాటిక పూర్తిగా నిండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని... ప్రభుత్వం వెంటనే స్పందించి మరికొంత స్థలాన్ని కేటాయించాలని అధికారులు కోరుతున్నారు.  

click me!