పాపం సమంత... కోడలు కాకముందే

Published : Feb 14, 2017, 02:16 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
పాపం సమంత... కోడలు కాకముందే

సారాంశం

సినీనటి సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ ఈ విషయంపై కేటీఆర్ ను నిలదీస్తున్నారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్‌ శాసన మండలి సభ్యుడు షబ్బీర్‌ అలీ ఇటీవల బాగా మండిపడుతున్నారు. కారణమేంటో తెలియదు కానీ కేసీఆర్ కుమారుడిని రాజకీయ బచ్చా అంటూ పదే పదే ఆయననే టార్గెట్ చేస్తున్నారు.  ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఆయన కేటీఆర్ పైనే పడ్డారు.

 

‘వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని చెప్పులతో కొట్టడం ఖాయం.. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో మీ నాన్నను అడుగు.. మీ నాన్నకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

 

అంతటితో ఆగకుండా సినీ నటి సమంత గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించడం వెనుక మతలబు ఉందని ఆరోపించారు.

 

చేనేత వస్త్రాల ప్రచారానికి తెలంగాణ బిడ్డలు పనికిరారా అని కేటీఆర్ ను నిలదీశారు.కేటీఆరకటకక నిలదనాగార్జునతో ఉన్న లావాదేవీలతోనే సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని ఆరోపించారు.

ఇదంతా గమనిస్తే పాపం సమంత అనిపిస్తోంది. నాగార్జున ఇంట ఇంకా కోడలుగా అడుగుపెట్టకముందే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?