కల్వకుర్తి సాగునీటికి వంశీచంద్ రెడ్డి పోరుబాట

First Published Feb 14, 2017, 7:31 AM IST
Highlights
  • జలసాధన రైతు చైతన్య యాత్ర ప్రారంభించిన కల్వకుర్తి ఎమ్యెల్యే

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో రైతుల పొట్టకొట్టే చర్యలను అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతోందని కల్వకుర్తి ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని 37,742 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూపొందించిన కేఎల్ఐ ( కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ) ను రీ డిజైన్ పేరుతో కుదించడంపై మండిపడ్డారు. 

 

ఈ మధ్యకాంగ్రెస్ పార్టీ టిఆర్ ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజక్టుల డిజైన్ల మీద, వాటి ఖర్చు ల మీద పోరాటం ఉదృతం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా వంశీ, తన నియోజకవర్గం కల్వకుర్తి సమస్యల మీద పోరు బాట పట్టాడు.  జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఉన్న  ఏకైక జూనియర్ ఎమ్మెల్యే.  2014లో టిఆర్ ఎస్ ప్రభంజనం తట్టుకుని నెగ్గిన మొదటి దఫా శాసన సభ్యుడు. అయినా,సరే, టిఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇస్తూ, సీటును పదిలపర్చుకునే ందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇపుడు చేస్తున్న పాదయాత్ర కు ఆయన పెద్ద ఎత్తున , పార్టీ సీనియర్ నాయకుల్లాగా రైతులను సమీకరించారు.

అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమనగల్లు మండలంలోని పోలేపల్లి గ్రామంలో సోమవారం ఆయన "కే.ఎల్.ఐ జల సాధన రైతు చైతన్య యాత్ర" ను ప్రారంభించారు.

 

ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. కెఎల్ ఐ ప్రధాన కాలువతో పాటు డీ82 వెడల్పు , సామర్య్థాన్ని ఏ మాత్రం తగ్గించకుండా చివరి ఆయకట్టు వరకు 8.7 మీటర్ల వెడల్పు కొనసాగించాలని  అలాగే కల్వకుర్తి నియోజగవర్గంలోని ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండలాలకు సాగునీరు అందించే 40 కి.మీ. పొడువైన ఉపకాల్వను డీ82 ను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం  మూడు మండలాలకు లబ్ది చేకూర్చే ఉపకాల్వను 40 నుంచి 10 కి.మీలకు కుదిస్తోందని ఆరోపించారు .

 

దీని వల్ల ఈ మూడు మండలాల్లోని 37, 742 ఎకరాల ఆయకట్టు సాగు ప్రాంతం నీరందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.

 

డీ 82 ను కుదించే ఉత్తర్వును ఉపసంహరించుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమయ్యే 1773 కోట్లను వచ్చే బడ్జెట్ లో కేటాయించాలన్నారు.  లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

click me!