ఇతరుల జోక్యం సహించం: కోమటిరెడ్డి ఇష్యూపై క్రమశిక్షణ సంఘం

Published : Sep 26, 2018, 06:54 PM IST
ఇతరుల జోక్యం సహించం: కోమటిరెడ్డి ఇష్యూపై క్రమశిక్షణ సంఘం

సారాంశం

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సమాధానం కోసం వేచి చూడాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది.

హైదరాబాద్:  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సమాధానం కోసం వేచి చూడాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసుపై గడువు ముగిసినా కూడ రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు.

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో రెండో షోకాజ్ నోటీసును  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం జారీ చేసింది. మంగళవారం నాడు సాయంత్రానికి 24 గంటల గడువు ముగిసింది.

అయితే  ఈ గడువు ముగిసినా కూడ రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ సంఘానికి  వివరణ ఇవ్వలేదు. అయితే  తమ సమీప బంధవులు మరణించడంతో  క్రమశిక్షణ సంఘానికి  రాజగోపాల్ రెడ్డి వివరణ ఇవ్వలేకపోయారని కుటుంబసభ్యులు క్రమశిక్షణ సంఘానికి సమాచారాన్ని ఇచ్చారు.

ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం బుధవారం నాడు మధ్యాహ్నం చర్చించింది.  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ వ్యవహరాల్లో ఇతరులు తలదూర్చకూడదని సమావేశం అభిప్రాయపడింది.ఇతరుల జోక్యాన్ని కమిటీ సహించబోమని కమిటీ తేల్చి చెప్పింది.

ఎవరైనా కమిటీ ముందు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని కమిటీ అభిప్రాయపడింది. రాజగోపాల్ రెడ్డి  విషయంలో ఆయన సమాధానం కోసం ఎదురు చూడాలని కమిటీ నిర్ణయం తీసుకొంది.

సంబంధిత వార్తలు

అదే రిప్లై: షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి రియాక్షన్

కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ: కోమటిరెడ్డిపై ఏం చేస్తారు?

తమ్ముడికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...కఠిన నిర్ణయాలు వద్దని సూచన

వదల బొమ్మాళీ: కోమటిరెడ్డికి మరో షోకాజ్ నోటీసు

షోకాజ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డోంట్ కేర్

సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్