నాపై అన్ని కేసులు .. మరి కేసీఆర్‌పై , ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదు : రాహుల్ గాంధీ

By Siva Kodati  |  First Published Oct 19, 2023, 8:00 PM IST

తెలంగాణ మొత్తాన్ని ఓ కుటుంబం కంట్రోల్ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ . మోడీ నాపై ఎన్నో కేసులు పెట్టారని.. మరి కేసీఆర్‌పై వున్న కేసులు ఎన్ని అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు .  తాను ఎప్పుడూ రాజీపడలేదని.. సిద్ధాంతాలపై పోరాడానని ఎన్ని కేసులు పెట్టినా ఎంతగా ఇబ్బంది పెట్టినా భయపడనని ఆయన స్పష్టం చేశారు. 


తెలంగాణ మొత్తాన్ని ఓ కుటుంబం కంట్రోల్ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గురువారం కరీంనగర్‌లో రాహుల్ గాంధీ స్థానిక హౌసింగ్ బోర్డ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ఆయన ప్రసంగిస్తూ. కేసీఆర్, ఆయన కుటుంబం చేతిలోనే మొత్తం వ్యవస్థ వుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ రాజీపడలేదని.. సిద్ధాంతాలపై పోరాడానని ఎన్ని కేసులు పెట్టినా ఎంతగా ఇబ్బంది పెట్టినా భయపడనని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా దాడిని తాను ఎంజాయ్ చేస్తానని రాహుల్ గాంధీ వెల్లడించారు. 

మోడీకి అవసరమైనప్పుడల్లా కేసీఆర్ మద్ధతు ఇస్తారంటూ ఆయన దుయ్యబట్టారు. మోడీ నాపై ఎన్నో కేసులు పెట్టారని.. మరి కేసీఆర్‌పై వున్న కేసులు ఎన్ని అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చాం.. నెరవేర్చాం , ఎన్నికల్లో గెలిచి మీకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. తాను ఇక్కడికి అబద్ధాలు చెప్పడానికి రాలేదని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండర్, రైతు భరోసా కింద రూ.15000, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వృద్ధులకు నెలకు 4 వేలు పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 

Latest Videos

ALso Read: మోడీ, కేసీఆర్ కుమ్మక్కు .. సింగరేణిని అదానీకి అమ్మాలని కుట్ర , అడ్డుకుంటాం : రాహుల్ గాంధీ

అంతకుముందు పెద్దపల్లిలో జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ..  కేసీఆర్, మోడీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని అన్నారు.  మోడీ, కేసీఆర్ ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆయన తెలిపారు. సింగరేణి ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేసీఆర్ లాగే మోడీ కూడా అబద్ధాలు చెప్పి గెలిచారని .. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అన్నారని, మరి వేశారా అని ఆయన ప్రశ్నించారు. 

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ చెప్పారని.. మరి ఉద్యోగాలు వచ్చాయా అని రాహుల్ గాంధీ నిలదీశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన తెలిపారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని.. గ్యాస్ ధరలు పెంచి మోడీ ప్రభుత్వం పేదలపై భారం మోపిందని రాహుల్ దుయ్యబట్టారు. ఒక కుటుంబంతో వుండే అనుబంధం తనకు తెలంగాణతో వుందన్నారు. 

click me!