ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

By narsimha lodeFirst Published Sep 21, 2018, 10:58 AM IST
Highlights

తండ్రి చేతిలో గాయపడిన మాధవి ఇంకా ఐసీయూలోనే ఉంది. ఆమె పరిస్థితిని మరో 24 గంటల తర్వాత చెబుతామని  వైద్యులు ప్రకటించారు.


హైదరాబాద్: తండ్రి చేతిలో గాయపడిన మాధవి ఇంకా ఐసీయూలోనే ఉంది. ఆమె పరిస్థితిని మరో 24 గంటల తర్వాత చెబుతామని  వైద్యులు ప్రకటించారు. అయితే  వెంటిలేటర్‌ను తొలగించినప్పటికీ.. ఐసీయూలోనే  మాధవికి చికిత్స నిర్వహిస్తున్నారు.

రెండు రోజుల క్రితం హైద్రాబాద్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద మనోహారాచారి తన కూతురు మాధవి, అల్లుడు  సందీప్‌పై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఆసుపత్రిలో చేరిన నాటి నుండి  మాధవికి నాలుగు ఆపరేషన్లు నిర్వహించారు. గురువారం సాయంత్రం మాధవికి వెంటిలేటర్‌ను తీసివేశారు.  కానీ, ఆమె ఇంకా ఐసీయూలోనే ఉంది. మాధవి శరీరం చికిత్సకు సహాకరిస్తోందని వైద్యులు ప్రకటించారు.

మరోవైపు 24 గంటలు గడిస్తే కానీ, మాధవి పరిస్థితిని చెప్పలేమని  వైద్యులు చెబుతున్నారు. మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని  చెబుతున్నారు. అయితే 24 గంటల తర్వాత పరిస్థితిలో మార్పు వస్తే జనరల్ వార్డుకు షిప్ట్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే అవసరమైతే కాస్మోటిక్ సర్జరీని కూడ నిర్వహిస్తామని వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

click me!
Last Updated Sep 21, 2018, 10:58 AM IST
click me!