యూనిఫాంలు తీసేసి.. యముడి డ్రెస్ వేసుకున్న ట్రాఫిక్ పోలీసులు

By sivanagaprasad kodatiFirst Published Sep 21, 2018, 10:34 AM IST
Highlights

ఎంతగా అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. ఎంతటి కఠిన చర్యలు చేపడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. దీంతో హైదరాబాద్ సుల్తాన్ బజార్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శంకర్ రాజు వినూత్నంగా ఆలోచించారు. 

ఎంతగా అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. ఎంతటి కఠిన చర్యలు చేపడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. దీంతో హైదరాబాద్ సుల్తాన్ బజార్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శంకర్ రాజు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషం వేసి హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు.

ప్రజల నుంచి దీనికి మంచి స్పందన లభించింది.. అనంతరం సీఐ మాట్లాడుతూ... హిందూ శాస్త్రంలో యముడికి విశేష ప్రాముఖ్యత ఉంది.. ఆయనంటే భయపడేవారు ఉన్నారు. అందుకే రహదారి భద్రత గురించి ఆయన వస్త్రధారణలో వచ్చి చెబితే ఎలా ఉంటుందోనని ఆలోచించి.. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు.

ప్రజలందరికి 80 సంవత్సరాలు బతకాలని ఉంటుందని.. అయితే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల 30కే అవుట్ అయిపోతున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని యముడి వేషధారణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు చెబుతారన్నారు. అలాగే 17 హెల్మెట్లను ప్రజలకు బహుకరించానని... దీనికి మంచి స్పందన వస్తోందని.. తమ ప్రయత్నం ఫలించి కనీసం కొందరైనా మారితే అంతే చాలన్నారు.

click me!