జూబ్లీహిల్స్ అఫైర్ పబ్ లో అశ్లీల నృత్యాలు: కంపెనీ డైరెక్టర్ అరెస్టు

By telugu teamFirst Published Jan 18, 2020, 10:46 AM IST
Highlights

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అఫైర్ పబ్ లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించిన కేసులో పోలీసులు ఆగ్రోో కంపెనీ డైరెక్టర్ ను అరెస్టు చేశారు. ఇటీవల పబ్ లో ఆగ్రో కంపెనీ కోసం ఈవెంట్ మేనేజర్ ప్రసాద్ అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని పబ్ అశ్లీల నృత్యాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో పోలీసులు ఆగ్రో మేనేజ్ మెంట్ కంపెనీ డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీ మేనేజర్ ను, ఈవెంట్ మేనేజర్ ను కూడా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారంనాడు ఈ అరెస్టులు జరిగాయి.

జనవరి 12వ తేదీన అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి యువతులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పబ్ యజమాని, దాని మేనేజర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. 

Also Read: జూబ్లీహిల్స్ పబ్ లో అశ్లీల నృత్యాలు: నిర్వాహకులు వీరే, పోలీసుల గాలింపు

రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) ద్వారా పబ్ మూసేయించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బంజారా హిల్స్ ఎసీపికి అందిన సమాచారం మేరకు టీఓటీ పబ్ పై జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. టీఓటీ పబ్ ను అఫైర్ పబ్ అని పిలుచుకుంటారు.

పోలీసులను చూసి మగ కస్టమర్లు పారిపోయారు. సిగ్నోవా ఆగ్రో మేనేజ్ మెంట్ మేనేజర్ మొహమ్మద్ మోయిన్ విజ్ఞప్తి మేరకు ఈవెంట్ మేనేజర్ బి ప్రసాద్ వినోదం కోసం మహిళలను ఎంగేజ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Also Read: జూబ్లీహిల్స్ రేవ్ పార్టీలో ట్విస్ట్: అశ్లీల నృత్యాలు, వ్యభిచారం, సూత్రధారి ఇతనే

ఒక్కో మహిళకు రూ. 3,500 చొప్పున చెల్లించారు. పబ్ మేనేజర్ భరత్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. ఆ తర్వాత భరత్ కనిపించకుండా పోయాడు. 

భరత్, మొయిన్, ప్రసాద్, సిగ్నోవా ఆగ్రో మేనేజ్ మెంట్ ప్రైవెట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీనివాస నాయుడు, పబ్ యజమాని సంతోష్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలే జరిగిన పంజగుట్టలోని రెండు పబ్ లను కూడా మాసేయాలని పోలీసులు సిఫార్సు చేశారు.

Also Read: పబ్ లో అశ్లీల నృత్యాలు... 23మంది అమ్మాయిలు అరెస్ట్

click me!