మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన..

By Mahesh Rajamoni  |  First Published Jun 9, 2023, 4:23 AM IST

Hyderabad: కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే కారణమనీ, 'చాంద్ సితారే చోడో, పానీ ఔర్ బిజిలీ జోడో' (చంద్రుడు, నక్షత్రాలను కిందకు దించడం మర్చిపోండి, కనీసం నీరు, విద్యుత్ ఇవ్వండి) అనే నినాదాన్ని లేవనెత్తాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
 


CM KCR to visit Mancherial: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం (జూన్ 9) మంచిర్యాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం ఒకరోజు పర్యటనకు మంచిర్యాల జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ పర్యటనలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ), బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. చెన్నూరు ఎత్తిపోతల పథకం, ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

Latest Videos

ఇదిలావుండ‌గా, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే కారణమనీ, 'చాంద్ సితారే చోడో, పానీ ఔర్ బిజిలీ జోడో' (చంద్రుడు, నక్షత్రాలను కిందకు దించడం మర్చిపోండి, కనీసం నీరు, విద్యుత్ ఇవ్వండి) అనే నినాదాన్ని లేవనెత్తాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రైతాంగానికి రక్షిత తాగునీరు, సాగునీరు, క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసమంజస విధానాలపై దేశ ప్రజలు మేల్కొని పోరాడాలని ఆయన కోరారు.

బుధవారం ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ లో చేరిన మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతుండగా, మధ్యప్రదేశ్ నుంచి వలసలు ఊపందుకున్నాయి.

click me!