ఇంటి ముందు పూజలు .. పోలీసులకు చెప్పాం, ఆరోజే స్పందించి వుంటే : నవ్య తల్లి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 08, 2023, 09:44 PM IST
ఇంటి ముందు పూజలు .. పోలీసులకు చెప్పాం, ఆరోజే స్పందించి వుంటే : నవ్య తల్లి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

మంత్రాల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించింది నవ్య తల్లి. తమ ఇంటి ముందు క్షుద్ర పూజలు జరుగుతున్నాయని , వాటిని ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

హైదరాబాద్‌‌లో ఓ బాలిక ఆత్హత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్ల కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి బాలిక తల్లి సంచలన ఆరోపణలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కుల్సుంపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ బస్తీ పరదిలో నవ్య అనే బాలిక బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. తమ ఇంటి ముందు వారం నుంచి ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించింది.

మంత్రాలు చేసి తమ బిడ్డను చంపేశారని.. పూజలకు సంబంధించి ఫోటోలు తీశానని, వాటిని ఫోటోలు తీశామని దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని ఆమె చెప్పింది. కానీ పోలీసులు సరిగా స్పందించలేదని.. ఆరోజునే నిందితులను పట్టుకుని వుంటే తమ బిడ్డ ప్రాణాలతో వుండేదని ఆమె కంటతడి పెట్టింది. బుధవారం కూడా తమతో సరదాగా వుందని.. తనను, తన భర్తను నవ్వుతూ పనులకు పంపిందని పేర్కొంది. 

ALso Read: హైదరాబాద్ లో ఇంటిముందు క్షుద్రపూజలు.. 16 యేళ్ల బాలిక ఆత్మహత్య..

ఆమె అక్క వెర్షన్ చూస్తే.. నవ్య చాలా ధైర్యవంతురాలు, చాలా యాక్టివ్ అని అంటోంది. కానీ క్షుద్రపూజల ఘటన నుంచి చాలా భయానికి గురైందని..ఒక్కతి ఉండడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి భయపడుతూ తోడు రమ్మన్నదని అక్క చెబుతోంది. కాస్త చీకటి పడ్డా.. నీడలు కనిపించినా భయపడేదని.. ఆ ఘటనను ఆమె తీవ్రంగా మనసు మీదికి తీసుకుందని తెలిపింది. గత గురువారం ఆమావాస్య రోజు తమ ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు పడేశారు. వాటిని నవ్యనే ఊడ్చి పారేసింది. ఆ రోజు నుంచి ఆమె అలా ప్రవర్తిస్తుంది.

మళ్లీ బుధవారం నాడు కూడా తమింటి వాకింట్లో .. నిమ్మకాయలు, కుంకుమలో ముంచి వేశారు. వాటిని చూసి.. మళ్లీ వేశారని అక్కతో చెప్పింది. పట్టించుకోవద్దని చెప్పానని నవ్య సోదరి తెలిపింది. నవ్యనే వాటిని ఇంటిముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసింది. ఆ తరువాత స్నానం చేసి.. తమతో సరదాగా గడిపింది. అక్క వంట చేయి అంటే.. నేను వంట చేస్తున్నాను. గుడ్లు తెస్తానంటూ తెచ్చిచ్చింది. నేనే ఇంట్లో పైన వంట చేస్తున్నా.. అక్క నేను 5 ని.ల్లో వస్తా అని పైనుంచి కిందికి వచ్చి గదిలో ఆత్మహత్య చేసుకుంది... అని ఆమె అక్క తెలిపింది. వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నవ్య రెండో అమ్మాయి. ఇంటర్ చదువుకుంటోంది. తమ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నవ్య చాలా ధైర్యవంతురాలని, తాను, చిన్నచెల్లె కాస్త సెన్సిటివ్, ఎవ్వరి జోలికీ వెళ్లమని ఆమె చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu