
హైదరాబాద్: ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ హఠాన్మరణం తెలంగాణ ఉద్యమకారులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఇతర కళాకారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో బిజినేపల్లి మండలంలోని తన ఫామ్ హౌజ్‌కి వెళ్లారు. అక్కడ రాత్రిపూట అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ జిల్లాలోని హాస్పిటల్‌కు తరలించారు. అటు నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, సాయి చంద్ అప్పటి మరణించినట్టుగా ఆ వైద్యులు నిర్దారించారు. అనంతరం, రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని స్వగృహానికి సాయిచంద్ భౌతిక కాయాన్నితరలించారు.
వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికాసేపట్లో సాయి చంద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమ యాత్ర ప్రారంభమవనుంది.
Also Read: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు.. అట్టుడుకుతున్న ప్యారిస్
సాయిచంద్ మరణంపై సీఎం కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాయిచంద్ మరణంపై ఆవేదన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి గుర్రంగూడలోని సాయి చంద్ నివాసానికి వెళ్లబోతున్నారు. సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో సాయి చంద్ క్రియాశీలకంగా పాల్గొన్నారు. తన గళంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపాడు. 2021 డిసెంబర్‌లో సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం కేసీఆర నియామించారు.