తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. మొదటిసారి చేసిన ట్వీట్ ను కాసేపటికి డిలీట్ చేసిన ఆయన.. దాన్నే మరోసారి రీ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీలో రోజుకో రచ్చతెరకెక్కుతోంది. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం రేపుతోంది. ఆయన మొదట గురువారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. దానికి ఓ వీడియోను అటాచ్ చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. గొడవ ఇంతటితో సద్దుమణిగింది అనుకునేలోపే.. రెండు గంటల తరువాత అదే ట్వీట్ ను అదే వీడియోతో మళ్లీ రీ పోస్ట్ చేశారు.
దానికి కొనసాగింపుగా మూడో ట్వీట్ చేశారు. అందులో ఆ వీడియోతో తాను చెప్పదలుచుకున్నదేమిటో వివరణ ఇచ్చారు. మొదట చేసి ట్వీట్ ను రీ పోస్ట్ చేస్తూ రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే స్వపక్షాన్ని టార్గెట్ చేసే తాను ఆ పోస్ట్ చేశానని మూడో ట్వీట్ లో వివరణ ఇచ్చారు. జితేందర్ రెడ్డి చేసిన మొదటి ట్వీట్ వీడియోలో ఓ జంతువును కొడుతూ.. ట్రాలీలోకి ఎక్కించడం కనిపిస్తుంది. అయితే ఈ ట్వీట్ మీద బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిలీట్ చేశారు. ఆ తరువాత మరో రెండు గంటల తరువాత.. అదే ట్వీట్ ను రీపోస్ట్ చేశారు.
టీ బీజేపీలో జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ వీడియో పోస్టు.. కాసేపటికే..
వివాదాస్పద ట్వీట్ కు కొనసాగింపుగా మూడో ట్వీట్ చేశారు. మొదటి సారి ట్వీట్ చేసినప్పుడు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిలీట్ చేశారు. ఆ తరువాత మరో రెండు గంటల తరువాత.. అదే ట్వీట్ ను రీపోస్ట్ చేశారు. ఆ తరువాత కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలను ఉద్దేశించి చేసిన ట్వీట్ అంటూ వివరణ ఇచ్చారు. ఈ ట్వీట్ ను బీఎల్ సంతోష్, అమిత్ షా, బన్సాలీలకు ట్యాగ్.. చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పశువుకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ అందులో ఆయన పేర్కొన్నారు. మూడో ట్వీట్ లో ఆయన ‘కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే...బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి’.. అని రాశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ నాయకత్వాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరు బీజేపీలో ఉండి కేసీఆర్ కు విధేయులుగా ఉన్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు... గతకొంతకాలంగా బీజేపీలో ఈటెల రాజేందర్ మీద నడుస్తున్న గొడవకు ఇది కొనసాగింపా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే...
బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి
This treatment is what's required for Bjp Telangana leadership. pic.twitter.com/MMeUx7fb4Q
— AP Jithender Reddy (@apjithender)