కారణమిదీ: బండి సంజయ్ కు జేపీ నడ్డా ఫోన్

Published : Jun 29, 2023, 01:13 PM IST
కారణమిదీ: బండి సంజయ్ కు  జేపీ నడ్డా  ఫోన్

సారాంశం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఫోన్  చేశారు. 

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా  ఫోన్  చేశారు.   మహాజన్ సంపర్క్ అభియాన్  కార్యక్రమాలపై  జేపీ నడ్డా  ఆరా తీశారు. జూలై  8వ తేదీన  హైద్రాబాద్ లో జరిగే  పార్టీ కార్యక్రమం గురించి జేపీ నడ్డా  బండి సంజయ్ తో  చర్చించారు. మరింత  ఉత్సాహంతో  పనిచేయాలని బండి సంజయ్ కు  జేపీ నడ్డా  సూచించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను  మారుస్తున్నారని  గత కొంత కాలంగా  ప్రచారం సాగుతుంది.  అయితే  ఈ ప్రచారాన్ని బీజేపీ నాయకత్వం కొట్టి పారేస్తుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  తరుణ్ చుగ్  ఈ విషయమై  నిన్న కూడ   స్పందించారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని  బీజేపీ  నాయకత్వం  చెబుతుంది.  బీజేపీ  తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని  రాష్ట్రానికి  చెందిన కొందరు  నేతలు  బీజేపీ నాయకత్వాన్ని  ఇటీవల  కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే  బండి సంజయ్ ను  మార్చబోమని  బీజేపీ జాతీయ  నాయకత్వం తేల్చి చెప్పింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు కాదు మూడ్రోజుల సెలవులు.. ఈ సోమవారం కూడా హాలిడేనే, ఎందుకో తెలుసా?
Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్