రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా: విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

By narsimha lodeFirst Published Sep 21, 2021, 4:50 PM IST
Highlights


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా వేశారు. ఈ విషయమై సిటీ సివిల్ కోర్టులో మంత్రి కేటీఆర్  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.


హైదరాబాద్:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణను పూర్తి చేసింది సిటీ సివిల్ కోర్టు. ఈ విషయమై తీర్పును సిటీ సివిల్ కోర్టు రిజర్వ్ చేసింది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నాడు మంత్రి కేటీఆర్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్టుకు సిద్దమని తన వెంట్రుకలు రక్త నమూనాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిద్దమా అని ప్రశ్నించారు.

also read:ఎవరికో కాదు... ముందు రేవంత్ ఫ్యామిలీకి డ్రగ్స్ టెస్ట్..: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిశోర్ డిమాండ్

ఈ విషయమై కేటీఆర్ కూడా కూడ స్పందించారు. రాహుల్ గాంధీ పరీక్షలకు సిద్దమైతే తాను కూడ పరీక్షలు చేయించుకొంటానని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్దమా అని కేటీఆర్ ప్రశ్నించారు.అయితే ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. సహారా కుంభకోణం, పీఎఫ్ స్కామ్ లో కేసీఆర్   లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దమైతే తాను కూడ సిద్దమేనని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు తనకు ముడిపెట్టి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.తనకు సంబంధం లేని విషయంలో తనకు ఈ కేసులను అంటగట్టే ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో  ఈ పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది. మరోసారి కేటీఆర్ తరపు న్యాయవాది సరైన పత్రాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను మంగళవారం నాడు సాయంత్రం కోర్టు విచారించింది.విచారణను  పూర్తి చేసిన కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది.


 

click me!