ఆడపిల్లకు జన్మనిచ్చిన ‘దిశ’ నిందితుడి భార్య

Published : Mar 07, 2020, 07:40 AM IST
ఆడపిల్లకు జన్మనిచ్చిన ‘దిశ’ నిందితుడి భార్య

సారాంశం

రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.  

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా హత్యాచారం కేసు నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రేణుకా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చి చేరింది. 

Also Read దిశ కేసు: హడావిడి చేసిన ఆర్జీవీ.. చెన్నకేశవులు భార్యకు చేసిన సాయం ఇదా!.

ఈ క్రమంలో శుక్రవారం రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా.. గతేడాది వెటర్నరీ వైద్యురాలు దిశపై చెన్నకేశవులు సహా నలుగురు యువకులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను మరింత కిరాతకంగా హత్య చేశారు. కాగా... ఈ కేసులో భాగంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా.. దర్యాప్తులో భాగంగా సీన్ రీక్రియేట్ చేసే క్రమంలో.. పోలీసులు నలుగురు నిందితులను ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లగా.. అక్కడ వారు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ