రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

By narsimha lodeFirst Published Nov 23, 2018, 10:40 AM IST
Highlights

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో పాటు టీడీపీ చీఫ్  నారా చంద్రబాబునాయుడు  కలిసి ప్రచారం నిర్వహించనున్నారు


హైదరాబాద్: తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో పాటు టీడీపీ చీఫ్  నారా చంద్రబాబునాయుడు  కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. తొలిసారిగా  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కలిసి చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రచార సభలో  పాల్గొంటారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు గాను  కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ కూటమిగా  ప్రజా కూటమి( మహాకూటమి) ఏర్పాటైంది.  ఈ కూటమిలో టీజేఎష్,  సీపీఐ కూడ  భాగస్వామ్యులుగా ఉన్నాయి.

  ప్రజా కూటమి ఏర్పాటులో  టీడీపీ  కీలక పాత్ర పోషించింది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా  కాంగ్రెస్  పార్టీ  సహాయంతో  కూటమిని ఏర్పాటు చేయడంలో కూడ చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే  తెలంగాణ రాష్ట్రంలో  కూడ  టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా  చంద్రబాబునాయుడు కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.

ప్రజా కూటమి ఉమ్మడి సభల నిర్వహణపై కూడ భాగస్వామ్య పార్టీలు దృష్టి పెట్టాయి. నవంబర్ 23వ తేదీన మేడ్చల్  లో జరిగే  కాంగ్రెస్ సభలో సోనియాగాంధీ సభలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడ పాల్గొంటారు.  ఈ నెల 28,29 తేదీల్లో  కాంగ్రెస్  పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ   తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఈ సభల్లో టీడీపీ  చీఫ్  చంద్రబాబునాయుడు కూడ పాల్గొంటారు. 

ఈ తేదీల్లో  ఏఏ  ప్రాంతాల్లో సభలను నిర్వహిస్తారే విషయమై ఇంకా స్పష్టత కావాల్సి ఉంది.   కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా  హెచ్ డీ కుమారస్వామి  ప్రమాణస్వీకారం చేసిన  సమయంలో  సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి  బీజేపీయేతర పార్టీల అగ్రనేతలు పాల్గొన్న  సభలో  చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

ఆ సభలో కాంగ్రెస్ పార్టీ  చీఫ్  రాహుల్ గాంధీని చంద్రబాబునాయుడు భుజం తట్టారు.   ఇటీవలనే రాహుల్ గాంధీని  చంద్రబాబునాయుడు కలిశారు. బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటు విషయమై చర్చించారు.

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

click me!