కోరుట్లలో దీప్తి అనే యువతి అనుమానాస్పద మృతిపై ఆమె సోదరి చందన స్పందించారు. దీప్తి మరణానికి తనకు సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె ఆడియో మేసేజ్ ను పంపింది.
కోరుట్ల:జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దీప్తి అనే యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దీప్తిని తాను చంపలేదని ఆమె సోదరి చందన ఓ ఆడియో మేసేజ్ ను సోదరుడికి పంపింది.
హైద్రాబాద్ లో బంధువుల గృహప్రవేశానికి పేరేంట్స్ వెళ్లారు.ఈ సమయలో అక్కా చెల్లెళ్లు దీప్తి, చందన ఇంట్లో ఉన్నారు. దీప్తి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఆమె సోదరి చందన బీటెక్ చేస్తుంది. వీరి సోదరుడు సాయి బెంగుళూరులో చదువుకుంటున్నాడు.
undefined
గృహ ప్రవేశం నుండి తిరిగి రాకముందే దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె సోదరి చందన ఇంటి నుండి వెళ్లిపోయింది. చందన వెంట ఓ యువకుడిని కూడ పోలీసులు గుర్తించారు. చందన ఎక్కడికి వెళ్లిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే తన సోదరి దీప్తి చనిపోయిన విషయం తెలుసుకున్న చందన తన సోదరుడికి వాయిస్ మేసేజ్ పంపింది. తన స్నేహితుడి ద్వారా మందు తెప్పించినట్టుగా చందన ఆ వాయిస్ మేసేజ్ లో పేర్కొందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
also read:అక్క అనుమానాస్పద మృతి: చెల్లె పరార్, వీడని మిస్టరీ
మద్యం సేవించిన తర్వాత దీప్తి సోఫాలో పడుకుందన్నారు. ఆమెను లేపే ప్రయత్నం చేసినా ఆమె లేవలేదన్నారు. తాను ఇంటి నుండి వెళ్లిపోయేందుకు సరైన సమయంగా భావించి వెళ్లిపోయినట్టుగా చందన ఆడియో మేసేజ్ లో పేర్కొందని ఆ కథనం తెలిపింది. దీప్తిని చంపాల్సిన అవసరం తనకు లేదని కూడ చందన సోదరుడికి వివరించింది. అయితే దీప్తి మృతికి సంబంధించి చందన దొరికితే అసలు విషయాలు తేలే అవకాశం ఉంది.