కేసీఆర్ నుండి ఇంకా ముందే బయటకు రావాల్సింది: నారాయణ

By narsimha lode  |  First Published Aug 30, 2023, 12:08 PM IST

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మునుగోడులో  బీఆర్ఎస్ కు మద్దతివ్వాల్సిన పరిస్థితులు వచ్చినట్టుగా సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.
 


న్యూఢిల్లీ: కేసీఆర్ నుండి ఇంకా ముందే  బయటకు రావాల్సిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.బుధవారంనాడు న్యూఢిల్లీలో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. కానీ, కాంగ్రెస్ లో ఎప్పుడూ కుమ్ములాటలే ఉంటాయన్నారు. 
 మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు మద్దతిచ్చిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో  కాంగ్రెస్, సీపీఐ కలిస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు.  బీజేపీ ఊగిసలాట నుండి బయటకు రావాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీకి వ్యతిరేకంగా  ఓ ఫ్రంట్ ఏర్పడి పోటీ చేస్తే  మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని  నారాయణ అభిప్రాయపడ్డారు.మాంసం అమ్మేవాళ్లను టీటీడీ మెంబర్లు చేశారని ఆయన మండిపడ్డారు.

గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  బీఆర్ఎస్ కు  ఉభయ కమ్యూనిస్టు పార్టీలు  మద్దతిచ్చాయి. అయితే ఈ సమయంలో నిర్వహించిన ఎన్నికల సభలో  రానున్న రోజుల్లో అన్ని ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని  కేసీఆర్ ప్రకటించారు. అయితే   అందుకు భిన్నంగా  కేసీఆర్  వ్యవహరించడంపై  లెఫ్ట్ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. 

Latest Videos

ఈ నెల  21న కేసీఆర్  115 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో  కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో  సంప్రదింపులను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు  సీపీఐ  నేత కూనంనేని సాంబశివరావు  ఆ పార్టీతో సంప్రదింపులు జరిపారు.  తమ పార్టీ ప్రతిపాదనలపై  కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంటేనే  భవిష్యత్తు చర్చలుంటాయని కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు.

మరో వైపు ఈ నెల  27న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  పొత్తులపై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని  నిర్ణయించారు.ఉభయ కమ్యూనిస్టు పార్టీలను ఒప్పించి వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.అయితే లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించే సీట్ల విషయంలో  కాంగ్రెస్ పార్టీ  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే  విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

click me!