వావివరసలు మరిచి అక్కతో అక్రమ సంబంధం... బావ చేతిలో బామ్మర్ది హతం

By Arun Kumar P  |  First Published Aug 30, 2023, 1:32 PM IST

వావివరసలు మరిచి అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్న బిహారీ యువకుడు బావ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 


హైదరాబాద్ : మానవ సంబంధాలకే మచ్చలాంటి దారుణ సంఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. అక్క వరసయ్యే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి యువకుడు చివరకు బావ చేతిలో హతమయ్యాడు. మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన యువకుడి హత్యకేసును పోలీసులు ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్ కు చెందిన పంకజ్ పాశ్వాన్(26) భార్యతో కలిసి ఉపాధ నిమిత్తం హైదరాబాద్ కు వలసవచ్చాడు. మైలార్ దేవ్ పల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ ఇంట్లో దంపతులు అద్దెకుంటున్నారు. అయితే పాశ్వాన్ భార్య బాబాయ్ కూడా కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడు.భార్య, కొడుకుతో కలిసి దంపతులు నివాసముండే ఇంట్లోనే అద్దెకు వుంటున్నాడు. 

Latest Videos

ఒకే ఇంట్లో అద్దెకుండే బాబాయ్ కొడుకుతో పంకజ్ భార్యకు చనువు పెరిగింది. వావివరసలు మరిచిన వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వరసకు అక్కాతమ్ముడు కావడంతో పంకజ్ పాశ్వాన్ కు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కానీ తాగినమైకంలో తనకు అక్కతో అక్రమసంబంధం వుందని బావతోనే చెప్పేసాడు యువకుడు. దీంతో బామ్మర్దిపై కోపంతో రగిలిపోయిన పంకజ్ పాశ్వాన్ దారుణానికి ఒడిగట్టాడు. 

Read More  జనగామలో దారుణం: భార్యతో వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో లీక్, ఆమె భర్త ఏం చేశాడంటే..

కాటేదాన్ లోని ఓ పరిశ్రమలో పంకజ్ పాశ్వాన్ తో పాటు యువకుడు కూడా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 27న ఇద్దరూ కలిసే పరిశ్రమకు వెళ్లారు. ఆ రోజు జీతం డబ్బులు ఇవ్వడంతో ఆ సొమ్ము తీసుకుని ఇద్దరూ ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం ఇద్దరూ తిన్నతర్వాత సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లారు. ఇలా యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన పంకజ్ పాశ్వాన్ వెంటతెచ్చుకున్న కత్తితో అతి దారుణంగా గొంతుకోసం చంపాడు. రక్తపుమడుగులో పడి కొట్టుకుంటున్న యువకుడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాతే అక్కడినుండి వెళ్లిపోయాడు. 

నిర్మానుష్య ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడిని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువకుడికి గతంలో బావ పంకజ్ తో గొడవ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పంకజ్ పై అనుమానంతో అదుపులోకి తీసుకుని  విచారించగా భార్యతో అక్రమ సంబంధం విషయం తెలిసి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకుపంపారు పోలీసులు.

click me!