లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రం పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తామని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మళ్లీ మారనుంది. గతంలో ఉన్న యాదగిరిగుట్ట పేరునే మళ్లీ ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొబ్బరి కాయకొట్టే స్థలాన్ని ప్రారంభించారు.
ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్.. ఆ భూముల అప్పగింతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
అనంతరం బీర్ల అయిలయ్య మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. త్వరలోనే ఆయన ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. ఆలయ క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, దాని కోసం నెల రోజుల లోపు సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
Rameshwaram Cafe: పేలుడు సంభవించిన బ్యాగ్‌ను ఓ వ్యక్తి వదిలిపెడుతుండగా కనిపించాడు: సీఎం సిద్ధరామయ్య
యాదగిరి గుట్టపై డార్మిటరీ హాల్ నిర్మిస్తామని బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. పది రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. పూర్వకాలం నుంచి ఈ ఆలయానికి యాదగిరిగుట్ట అని పేరుందని, దానిని మార్చడం సరికాదని తెలిపారు. ఆలయంలో పని చేసే పూజారుల కోసం రెస్ట్ రూమ్ లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు.