షిర్డీ వెడుతున్నానని భార్యకు చెప్పి.. స్నేహితుడి వైఫ్ ను తీసుకుని వెళ్లిపోయాడో వ్యాపారి. తనను వెతకొద్దని తామిద్దరం వెడుతున్న సంగతి స్నేహితుడికి కూడా తెలుసునని ఉత్తరం కూడా రాసి పెట్టాడు.
హైదరాబాద్ : వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో పచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లై.. చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలతో ఏ చీకు చింత లేకుండా కాపురం చేసుకుంటున్న వాళ్ళు.. క్షణికమైన సుఖాల కోసం చేతులారా కాపురాల్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అలాంటి ఓ సంఘటన హైదరాబాదులోని కంటోన్మెంట్ ఏరియాలో వెలుగు చూసింది. న్యూ బోయిన్పల్లికి చెందిన అతుల్ (45) అనే వ్యాపారి స్నేహితుడి భార్యను తీసుకుని వెళ్లిపోయాడు.
ఇంట్లో మాత్రం షిరిడి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు. అతను వెళ్ళిన తెల్లారి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కంగారుపడుతున్న ఆ వ్యాపారి అతుల్ భార్యకు ఇంట్లో అతను రాసిన ఓ ఉత్తరం దొరికింది. తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని.. అందుకే ఆమెతో కలిసి వెళ్లిపోతున్నానని రాశాడు. ఈ విషయం తన స్నేహితుడికి కూడా తెలుసు అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు తమ గురించి వెతకొద్దని ఆ లేఖలో రాసి ఉంది. అది చదివిన తర్వాత గమనించగా ఇంట్లో పది లక్షల రూపాయలు కూడా కనిపించడం లేదు. దీంతో అతుల్ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మారేడుపల్లి ఎస్సై మోహన్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం : శరత్ చంద్రారెడ్డితో.. కవిత, కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం..!!..
ఇదిలా ఉండగా, భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో అకాల మృత్యువాత పడ్డాడు ఓ జానపద కళాకారుడు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇక్కడి జన్నగట్ట గ్రామ నివాసి జన్నగట్ట కృష్ణమూర్తి (50) జానపద కళాకారుడు. అతని భార్య శ్రీధర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి హత్య చేయించింది.
దీనికి సంబంధించిన కేసు నమోదు కావడంతో కోలారు రూరల్ పోలీసులు.. కృష్ణమూర్తి భార్య సౌమ్య, ప్రియుడు శ్రీధర్.. వారికి సహకరించిన మరో వ్యక్తి.. అతని పేరు కూడా శ్రీధరే.. ముగ్గురిని అరెస్టు చేశారు. మొదట జొన్నగట్ట రైల్వే బ్రిడ్జి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో టూవీలర్ మీద వెడుతున్న జొన్నగట్ట కృష్ణమూర్తి అనే జానపద కళాకారుడు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి.
ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు.. కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారించగా…భార్య సౌమ్య.. ప్రియుడితో కలిసి హత్య చేయించిన విషయం వెలుగు చూసింది. గత కొన్నేళ్లుగా జొన్నగట్ట కృష్ణమూర్తి కుటుంబంలో కలహాలు ఉన్నట్లుగా తెలిసింది. ఆయన భార్య సౌమ్యకు మేనమామ కొడుకుతో వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.దీనిమీద పలుమార్లు పెద్దల పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమనగలేదు. దీంతో, ఎప్పటికైనా భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన సౌమ్య.. మేనబావతో కలిసి.. మరో వ్యక్తి సహాయంతో అతడిని హత్య చేయించింది.
ఆ తర్వాత భార్య సౌమ్య దీన్ని యాక్సిడెంట్ గా నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులకు మృతుడి తల వెనుక ఉన్న గాయాలు అనుమానం రేకెత్తించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు సౌమ్య, ఇద్దరు శ్రీధర్ లను అరెస్టు చేసి వారి మీద కేసు నమోదు చేశారు. సౌమ్య, కృష్ణమూర్తిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.