ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదు : కిషన్ రెడ్డి

Published : Jun 02, 2023, 08:10 AM ISTUpdated : Jun 02, 2023, 08:24 AM IST
ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదు : కిషన్ రెడ్డి

సారాంశం

ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనే తెలంగాణ రాలేదని.. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

హైదరాబాద్ :  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి ప్రారంభించారు. ఈ ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ జరుపుతోంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఈ ఒక్క వ్యక్తి వల్ల రాలేదని అన్నారు.  

తెలంగాణ ఉద్యమ సమయంలో బిజెపి క్రియాశీలంగా పని చేసిందని చెప్పుకొచ్చారు. ఆ ఉద్యమ సమయంలో పార్లమెంటులో బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పోరాడారని గుర్తు చేశారు. ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టించడంలో బిజెపి కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా