BRS Plenary: దేశానికి సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం అవసరం : కే కేశవరావు

By Mahesh Rajamoni  |  First Published Apr 27, 2023, 9:07 PM IST

BRS Plenary: దేశంలో సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం అవసరమని ఎంపీ కే కేశవరావు అన్నారు. అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ దేశాన్ని దోచుకుంటుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
 


BRS MP K Keshava Rao: దేశంలో సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం అవసరమని ఎంపీ కేశవరావు అన్నారు. అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ దేశాన్ని దోచుకుంటుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. వివ‌రాల్లోకెళ్తే.. హైద‌రాబాద్ భ‌వ‌న్ లో అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్లీన‌రీ స‌మావేశాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఎంపీ కే కేశ‌వ‌రావు మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. 

దేశ ప్రగతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డైనమిక్ నాయకత్వం అవసరమన్నారు. అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దోచుకుంటుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కే కేశవరావు అన్నారు. గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కేడర్ బీఆర్ఎస్ కు అసలైన బలాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో జాతీయ లక్ష్యంపై దృష్టి సారించి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలన్నారు.

Latest Videos

"నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను చూసిన గొప్ప దార్శనిక నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్). 75 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాలు సాధించలేనిది కేవలం తొమ్మిదేళ్లలో ఆయన సాధించారు. అద్భుతమైన యాదాద్రి ఆలయం, 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ సముదాయాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ సమగ్రాభివృద్ధిలో యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది" : బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు

 

ఆరోగ్యం, వైద్యం, ప్ర‌జా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలను, ప్రజారోగ్యంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించిందని చెప్పారు. దేశ ప్రజా వనరుల కాపాడుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌నీ, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా ఉన్న సీఎం కేసీఆర్ లాంటి ప్రగతిశీల నాయకుడు దేశానికి అవసరమని అన్నారు.

click me!