Sangareddy: సైబర్ మోసంతో రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఒక టెక్కీ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బొమ్మారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టెక్కీ జడావత్ అరవింద్ (30) టెలిగ్రామ్ యాప్ లో వచ్చిన లింక్ ను చూసి మొదట రూ.200 పెట్టుబడి పెట్టాడు.
Techie who lost Rs.12 lakh to cyber fraud found hanging: ఇటీవలి కాలంలో సైబర్ నేరాల గురించి పోలీసులు ఎంత హెచ్చరించిన వీటి బారినపడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్ల చేతితో మోసపోయి డబ్బులు పోగొట్టుకుని టెక్కీ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డి గూడెంకు చెందిన జడావత్ అరవింద్ (30) టెలిగ్రామ్ యాప్ లో వచ్చిన లింక్ ను చూసి తొలుత రూ.200 పెట్టుబడి పెట్టాడు. అతను ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు, అతనికి ప్రతిఫలంగా రూ.250 లభించింది. ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టాడు ఈ క్రమంలోనే మే 5న జరగాల్సిన తన సోదరి వివాహం కోసం అతని తల్లిదండ్రులు పొదుపు చేసిన రూ .12 లక్షలు కోల్పోయాడు.
తన టెలిగ్రామ్ యాప్లో దొరికిన చాట్ ప్రకారం అరవింద్ తన డబ్బును తిరిగి ఇవ్వాలని మోసగాళ్లను వేడుకున్నప్పటికీ, వారు నిరాకరించారు. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న టెక్కీ బుధవారం మధ్యాహ్నం సంగారెడ్డిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పోలీసులు సైబర్ నేరాల గురించి ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ ల జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. తెలియని వారి నుంచి వచ్చిన సందేశాలు, లింక్ లకు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే, బ్యాంకు అకౌంట్ తో పాలు పర్సనల్ వివరాలు అడిగినా వెళ్లడించవద్దని పేర్కొంటున్నారు.