ఢీల్లీకి చేరుకున్న కవిత: రేపు ఈడీ విచారణపై ఉత్కంఠ

By narsimha lode  |  First Published Mar 15, 2023, 10:36 AM IST

బీఆ,ర్ఎస్ కల్వకుంట్ల కవిత  ఇవాళ హైద్రాబాద్ కు చేరుకున్నారు. రేపు ఆమె ఈడీ  విచారనకు  హాజరు కావాల్సి ఉంది. ఇవాళ మహిళా రిజర్వేషన్ పై రౌండ్  టేబుల్  సమావేశంలో  పాల్గొంటారు. 


న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  బుధవారంనాడు  న్యూఢిల్లీకి  చేరుకున్నారు.   ఇవాళ  మహిళా  రిజర్వేషన్ బిల్లుపై   రౌండ్  టేబుల్  సమావేశం  నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో  కవిత  పాల్గొంటారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రేపు ఈడీ విచారణకు  కవిత హాజరు కానున్నారు.

ఇవాళ ఉదయం  హైద్రాబాద్  నుండి  కల్వకుంట్ల కవిత  న్యూఢిల్లీకి  చేరుకున్నారు. ఈ పార్లమెంట్  సమావేశాల్లో  మహిళా రిజర్వేషన్ బిల్లును  ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో  ఈ నెల  10న జంతర్ మంతర్ వద్ద  కవిత  ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల  11న ఆమె  ఈడీ విచారణకు హాజరయ్యారు.  రేపు మరోసారి  విచారణకు  హాజరు కానున్నారు. 

Latest Videos

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆడిటర్ బుచ్చిబాబును  ఈడీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు.  ఇప్పటికే అరుణ్ రామచంద్రపిళ్లై  ఈడీ అధికారుల కస్టడీలో  ఉన్నారు.  ఈ ఇద్దరితో  కలిపి  కవితను  రేపు విచారిస్తారా, లేదా కవిత  ఒక్కరినే విచారిస్తారా అనే విషయమై  ఇంకా తెలియాల్సి ఉంది.  రేపు  కవిత  ఈడీ విచారణపై  ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై  భారత జాగృతి  సంస్థ ఆధ్వర్యంలో  ఇవాళ  రౌండ్ టేబుల్  సమావేశం  ఏర్పాటు  చేశారు కవిత.  ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి  పలు పార్టీలను  భారత జాగృతి సమితి ఆహ్వానించింది.  ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుండి  సాయంత్రం  ఐదు గంటల వరకు  రౌండ్ టేబుల్ సమావేశం  జరుగుతుంది.  ఈ సమావేశం తర్వాత కవిత మీడియాతో మాట్లాడనుంది. 

ఇదిలా ఉంటే  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ విచారణకు  రేపు కవిత హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో  ఇప్పటికే   అరెస్టైన   అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని కోర్టు పొడిగించింది.  దీంతో  రేపు  అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి  కవితను విచారించే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  గతంలో  ఇచ్చిన వాంగ్మూలాన్ని  అరుణ్ రామచంద్రపిళ్లై  వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై  కోర్టులో  వాదనలు జరిగే సమయంలో  ఈడీ తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు  చేశారు. ఓ వీవీఐపీకి  నోటీసులు ఇచ్చిన తర్వాత  అరుణ్ రామచంద్రపిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారని  కోర్టుకు తెలిపారు.  పరోక్షంగా  కవిత  పేరును  ఈడీ తరపు న్యాయవాది  కోర్టు ముందు  ప్రస్తావించారు.  

also read:'తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసు': కవితకు నోటీసులతో పిళ్లై స్టేట్ మెంట్ వెనక్కి

ఈ నెల  11న  కవిత  ఈడీ విచారణకు హాజరైన సమయంలో  మంత్రులు  హరీష్ రావు, కేటీఆర్ లు  కూడా ఢిల్లీకి వచ్చారు.  రేపు కూడా  తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తారా లేదా అనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.ఇదిలా ఉంటే  మంగళవారం తెల్లవారుజామున బీఆర్ెఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు  నిర్వహించారు. 

click me!