అన్నీ విషయాలు చెప్పా: కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య

By narsimha lodeFirst Published Jul 11, 2023, 3:57 PM IST
Highlights

పార్టీ  అధిష్టానం పిలుపు మేరకు  ప్రగతి భవన్ లో కేటీఆర్ తో  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  రాజయ్య ఇవాళ భేటీ అయ్యారు. 


హైదరాబాద్: తనకు కడియం శ్రీహరికి మధ్య  ఉన్న సమస్య పరిష్కారమైందని  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  పిలుపు మేరకు మంగళవారంనాడు  ప్రగతి భవన్ లో  కేటీఆర్ తో  రాజయ్య భేటీ అయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై  రాజయ్య  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  కేటీఆర్  రాజయ్యను పిలిపించి మాట్లాడారు. కడియం శ్రీహరితో విబేధాల గురించి  తనను కేటీఆర్ ప్రశ్నించారన్నారు.

కడియం శ్రీహరిని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని  కేటీఆర్ కు  రాజయ్య వివరించారు. కడియం శ్రీహరి తల్లిని అవమానించేలా  తాను  వ్యాఖ్యలు చేయలేదని రాజయ్య  ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరో వైపు కడియం శ్రీహరి అహంతో  ప్రతి రోజూ తనపై విమర్శలు చేస్తుంటారన్నారు.  ఈ విషయాలన్నీ తాను  కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా  రాజయ్య వివరించారు.తనను  కడియం శ్రీహరి ఏ రకంగా  ఇబ్బందులకు గురి చేస్తారో కూడ  కేటీఆర్ కు వివరించినట్టుగా ఆయన  ఆ ఇంటర్వ్యూలో తెలిపారు

also read:కడియంపై వివాదాస్పద వ్యాఖ్యలు: అధిష్టానం నుండి పిలుపు, కేటీఆర్‌తో భేటీ కానున్న రాజయ్య

అయితే  పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని కేటీఆర్ సూచించారన్నారు. ఇతర విషయాలన్నీ తమకు  వదిలేయాలని  కేటీఆర్ సూచించారని రాజయ్య చెప్పారు.  దీంతో  మూడు గంటలే రైతులకు విద్యుత్  అంశంపై  బీఆర్ఎస్  ఇచ్చిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం  చేస్తామన్నారు. రానున్న రోజుల్లో   కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు చేయకుండా ముందుకు వెళ్తానని  రాజయ్య చెప్పారు.వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి  ఎవరికి  టిక్కెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని  రాజయ్య చెప్పారు. 

ఇటీవలనే  కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు.  కడియం శ్రీహరి కులం గురించి రాజయ్య వ్యాఖ్యలు  చేశారు.  శ్రీహరి  తల్లి గురించి  కూడ  తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలపై  కడియం శ్రీహరి నిన్న  స్పందించారు.  తన కులం గురించి, తన  తల్లి గురించి  రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి మండిపడ్డారు.

click me!