
హైదరాబాద్: రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసే క్రమంలో రేవంత్ రెడ్డి రైతులకు విద్యుత్ 24 గంటలు అవసరం లేదని అన్నారు. విద్యుత్ కంపెనీలతో కమీషన్లు పుచ్చుకోవడానికే కేసీఆర్ 24 గంటల కరెంట్ అనే ఓ నినాదం తెచ్చాని పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రంలో మూడెకరాలకు లోపే సాగు చేసుకునే రైతుతే అత్యధికంగా ఉన్నారని అన్నారు. కాబట్టి, వారికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని, రోజుకు 8 గంటల విద్యుత్ అందితే చాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. బీఆర్ఎస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని నిర్ణయించింది. నిజానికి కేసీఆర్ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం దుయ్య బట్టారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని పేర్కొన్నారు.
Also Read: టీ కాంగ్రెస్‌లో ‘సీఎం సీటు’ పై రగడ.. ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం వ్యాఖ్యలతో దుమారం
రేవంత్ వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా కేటీఆర్ తప్పుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ దిగజారి మరీ రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. అదే విధంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అలా స్టేట్‌మెంట్ ఇవ్వడం సరికాదని వివరించారు. పూర్తి వీడియో చూసి స్పందిస్తే బాగుండేదని చెప్పారు.
ఇక సీతక్క సీఎం ఎపిసోడ్‌ను ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పదలిచారని వివరించారు. ఆయన ఉద్దేశ్యం అదేనని చెప్పారు. సీతక్క సీఎం అయితే, తప్పే ముందని అన్నారు. కాంగ్రెస్‌లో ముందు గా సీఎం అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదని వివరించారు.