మొగిలయ్యకి ఇంత అన్యాయమా : శ్రీనివాస్ గౌడ్‌పై గువ్వల బాలరాజు గుర్రు.. కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఎమ్మెల్యే

Siva Kodati |  
Published : Feb 16, 2023, 04:07 PM IST
మొగిలయ్యకి ఇంత అన్యాయమా : శ్రీనివాస్ గౌడ్‌పై గువ్వల బాలరాజు గుర్రు.. కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఎమ్మెల్యే

సారాంశం

క్రీడాకారులకు, కళాకారులకు స్థలాల కేటాయింపుకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌లో.. కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడంపై ఆయన ఫైర్ అయ్యారు. 

తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి తనను పిలవడంపై ఆయన మంత్రిపై గుర్రుగా వున్నారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చి.. కిన్నెర క్రీడాకారుడు మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడంపై గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగిలయ్యను ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రంలో అందరికీ తన కళను గుర్తుచేసింది తానేనని ఎమ్మెల్యే అంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాలరాజు స్పష్టం చేశారు. 

ఇకపోతే... పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు గతేడాది తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇల్లు, ఖర్చుల నిమిత్తం రూ.కోటి ప్రకటించారు కేసీఆర్. ప్రగతి భవన్‌లో మొగిలయ్యను సన్మానించారు కూడా. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. మొగిలయ్యకు గౌరవ వేతనం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ కళాకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని కేసీఆర్ అన్నారు. మొగిలయ్య తెలంగాణ కళను పునరుజ్జీవింపజేశారని సీఎం ప్రశంసించారు. 

ALso REad: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు కేసీఆర్ భారీ నజరానా.. ఇల్లు, ఖర్చుల కోసం రూ.కోటి రివార్డ్

కాగా.. శభాష్ 'భీమలా నాయకా' అంటూ దర్శనం మొగిలయ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి రుచి చూపించాడు మొగులయ్య. అంతకు ముందు వరకు మొగిలయ్య ఎవరికీ తెలియదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ కోసం ప్రారంభ లిరిక్స్ ని మొగిలయ్య తనదైన శైలిలో పాడి మెప్పించారు. 

భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలయ్యాక మొగిలయ్యని పలు మీడియా సంస్థలు పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేశాయి. దీనితో మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా మొగిలయ్య కిన్నెర కళని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 

ఇది మొగిలయ్యకు, కిన్నెర కళకు దక్కిన గొప్ప గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ విభిన్నంగా ఉండాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ భావించారు. అందుకే మొగిలయ్య ప్రతిభని గుర్తించి ఆయనతో భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడించారు. ఈ పాట పాపులర్ అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా మొగిలయ్యని అభినందించిన సంగతి తెలిసిందే. మొగిలయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం కూడా చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!