రాజ్యాంగంతో కాదు బుల్డోజర్‌తో పాలన సాగిస్తోంది: బీజేపీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Feb 16, 2023, 3:14 PM IST

Hyderabad: అస‌దుద్దీన్ ఒవైసీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. బుల్డోజ‌ర్ల‌తో రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం.. తల్లీ-కూతుళ్ల ప్రాణాలను తీసింద‌ని ఆరోపించారు. రాజ్యాంగంతో కాకుండా  బుల్‌డోజర్‌తో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నార‌ని విమర్శించారు.


AIMIM MP Asaduddin Owaisi: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఓడిపోతుందని ఏఐఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ బుల్డోజ‌ర్ల‌తో పాల‌న సాగిస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. అమాయక ప్ర‌జ‌ల ప్రాణాలను తీసుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. అస‌దుద్దీన్ ఒవైసీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. బుల్డోజ‌ర్ల‌తో రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం.. తల్లీ-కూతుళ్ల ప్రాణాలను తీసింద‌ని ఆరోపించారు. రాజ్యాంగంతో కాకుండా  బుల్‌డోజర్‌తో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నార‌ని ఆరోపించారు. గురువారం నాడు వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

Latest Videos

ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం రాజ్యాంగంతో కాకుండా బుల్డోజర్‌తో పరిపాలన సాగిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఆరోపించారు. "ఉత్త‌ర‌ప్రదేశ్ లో బుల్‌డోజర్‌ రాజకీయాలు చేస్తున్నవారు తల్లీకూతుళ్ల ప్రాణాలు తీశారు. రాజ్యాంగంతో కాకుండా బుల్‌డోజర్‌తో ప్రభుత్వాన్ని న‌డుపుతున్నారు. ఇవన్నీ చేయడం వల్ల వారు రాజకీయంగా ఏమీ పొందలేరని" అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తాజ్ మహల్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, “2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విఫలమవుతుంది” అని అన్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో ఆక్రమణల కూల్చివేత సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని తల్లీ-కూతుళ్ల ప్రాణాలు కోల్పోయారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు స్పందిస్తూ యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

click me!