కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పలువురు నేతలు ఠాక్రేతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆదిలాబాద్ నుండి హైద్రాబాద్ వరకు పాదయాత్ర చేయనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
గురువారం నాడు హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు గంటపాటు మాణిక్ రావు ఠాక్రేతో మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమవేశం ముగిసిన తర్వాత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించినట్టుగా మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై కూడా చర్చించినట్టుగా మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ నుండి హైద్రాబాద్ వరకు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 28న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మార్చి 1న ఉత్తమ్ కుమార్ రెడ్డి , మార్చి 2న భట్టి విక్రమార్కలు పాదయాత్రలు ప్రారంభించనున్నారని మహేశ్వర్ రెడ్డి వివరించారు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ సిద్దాంతాన్ని నమ్మిన నాయకుడని మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
పార్టీ నేతలతో మాణిక్ రావు ఠాక్రే ఇవాళ వరుసగా సమావేశాలు నిర్వహించారు.. జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు ఇవాళ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు హత్ సే హత్ జోడో అభియాన్ పేరుతో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన మేడారం నుండి పాదయాత్రను ప్రారంభించారు. తొలి విడతలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేయనున్నారు. 60 రోజుల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.
also read:కోమటిరెడ్డి పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడలేదు.. 70 సీట్లు మా టార్గెట్: జగ్గారెడ్డి
హత్ సే హత్ జోడో అభియాన్ కింద పార్టీ నేతల పాదయాత్రలకు సంబంధించి మాణిక్ రావు ఠాక్రే పార్టీ నేతల నుండి షెడ్యూల్ కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేపట్టే సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చెబుతారు.