ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు.. బీసీల జోలికొస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. : బీఆర్ఎస్

By Mahesh Rajamoni  |  First Published Jul 19, 2023, 4:52 PM IST

Hyderabad: "బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది  నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఆత్మ‌గౌర‌వంతో ముందుకు సాగుతుంటే.. అక్రోషం తో బీసీలపై మాట్లాడుతున్నారని" బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మండిప‌డ్డారు.
 


BRS: "బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఆత్మ‌గౌర‌వంతో ముందుకు సాగుతుంటే.. అక్రోషం తో బీసీలపై మాట్లాడుతున్నారని" బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మండిప‌డ్డారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీసీ ప్రజాప్రతినిధుల పై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై  బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర మంత్రులు డాక్టర్ వీ.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్,  ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, బసవరాజ్ సారయ్య, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర లతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

Latest Videos

ఈ సంద‌ర్భంగా మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నార‌నీ, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నార‌ని అన్నారు. బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చ‌రించారు. సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకు పోతుంటే అక్రోషం తో బీసీలపై మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.  బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో  బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంద‌ని ఆరోపించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకునీ టార్గెట్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని మండిప‌డ్డారు.

"మా ఓట్ల తో గెలిచి..మమ్మాల్ని టార్గెట్ చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ను తొందరలో ప్రకటిస్తాం. కులాల వారిగా మీటింగ్ లు పెడుతాం. ముక్కు, చెంపలు వేసుకుంటే తప్పా వారిని వదలం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.. కాంగ్రెస్ విధానాలను ఎండగడతాం. గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ బీసీల పై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అలాగే, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. సమాజంలో 56% బీసీ జనాభా ఉంద‌నీ, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోము.. మేం బానిసలం కాదు చైతన్యవంతులం అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. వెనుకబడిన వర్గాలను, నేతలను టార్గెట్ గా చేసుకొని కాంగ్రెస్ నేతల దూషణల పర్వం మానుకోవాలని హిత‌వు ప‌లికారు. కాంగ్రెస్ అధినాయకత్వం విధానం కూడా వెనుకబడిన వర్గాలను దూషించడమేనా? కాంగ్రెస్ లోని బీసీ నేతలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలకు మొత్తం సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చ‌రించారు.

త‌మ‌పై అన్యాయం జరిగితే కులాలుగా కాదు బీసీ సమాజంగా ప్రశ్నిస్తాం, తిరగబడతామ‌ని అన్నారు. బీసీలను, దళిత, వెనుకబడిన వర్గాలను దూషిస్తూ తాము మాట్లాడలేం, కేసీఆర్ సంస్కారం నేర్పారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలను, కులవృత్తులను ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి, సంక్షేమం నిర్వహిస్తోందని తెలిపారు. వేల కోట్లతో ఆత్మగౌరవభవనాలు, వేలాది గురుకులాలను వెనుకబడిన వర్గాల కోసం నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. కులవృత్తుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నామ‌నీ, ప్రతి సంక్షేమ పథకంలోనూ మెజార్టీ వాటాను వెనుకబడిన వర్గాలకు అందిస్తున్నామ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

click me!