మాతో టచ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు: బండి సంజయ్ సంచలనం

By narsimha lodeFirst Published Feb 16, 2024, 5:10 PM IST
Highlights

బీఆర్ఎస్ కు చెందిన  ప్రజా ప్రతినిధులు తమతో టచ్ లో ఉన్నారని  బీజేపీ నేత బండి సంజయ్  చెప్పారు.


హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు చెందిన  ఎమ్మెల్యేలు,  ఎంపీలు  తమ పార్టీతో టచ్ లో ఉన్నారని  భారతీయ జనతా పార్టీ (బీజేపీ)  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పారు.

శుక్రవారం నాడు  మీడియా ప్రతినిధులతో  చిట్ చాట్ చేశారు.  బీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు తమ పార్టీతో టచ్ లోకి వచ్చారని ఆయన  చెప్పారు.పార్లమెంట్ ఎన్నికలను తమ పార్టీ సీరియస్ గా తీసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి  మెరుగైన  సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ తో తమకు పొత్తు లేదని  ఆయన  చెప్పారు. బీఆర్ఎస్ తో తమ పార్టీకి  పొత్తు ఉందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.  మెడకాయ మీద తలకాయ ఉన్న వారు ఎవరు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరన్నారు.అవినీతి పార్టీ తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నుండి  ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారకుండా 
 కాపాడుకోవడం కోసమే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని  బండి సంజయ్ విమర్శించారు.బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంటూ  కేసీఆర్ మభ్యపెడుతున్నారని బండి సంజయ్  ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఒకరిని ఒకరు తిట్టుకుంటూ బీజేపీపై చర్చ లేకుండా చేస్తున్నారన్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు.  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు.

also read:ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

బీఆర్ఎస్ సర్కార్ అవినీతి కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిందని విమర్శించారు. మేడిగడ్డ  బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టును ఆయన ప్రస్తావించారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని రిపోర్టు తేల్చిందన్నారు. 

also read:అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి:కాంగ్రెస్‌లో చేరిక

నది జలాల విషయమై  కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ జైల్ లో వుండే వాడన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ కే పోటీ ఉంటుందన్నారు.ఆరు గ్యారెంటీలు  కాంగ్రెస్ అమలు చేయదన్నారు. ఆరు గ్యారంటీలు  కాంగ్రెస్ ను దెబ్బతీస్తాయని ఆయన విమర్శించారు.

also read:డబ్బులు చెట్లకు కాస్తున్నాయి...!: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

హైదరాబాద్ పార్లమెంట్ పై కూడా మేం దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. బోగస్ ఓట్లను తొగలించడం పై మర్రి శశిధర్ రెడ్డి టీం వర్క్ చేస్తుందని తెలిపారు. హరీష్ రావు పై అన్ని పార్టీలు సాఫ్ట్  కార్నర్ తో ఉన్నాయన్నారు.కేసీఆర్ అవినీతి ని వ్యతిరేకించి వస్తే హరీష్ రావును బీజేపీలో చేర్చుకుంటామని బండి సంజయ్ చెప్పారు.

click me!