ఆ రన్నింగ్ కామెంట్రీ ఏంటీ.. కేటీఆర్, కడియం కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు : కులగణనపై భట్టి విక్రమార్క

By Siva Kodati  |  First Published Feb 16, 2024, 4:23 PM IST

కేటీఆర్, కడియం కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం సంపదను పంచాలని.. సంపద, రాజకీయం, విద్య, అధికారం కొన్నిచోట్ల మాత్రమే కేంద్రీకృతమై వుందన్నారు. 


కేటీఆర్, కడియం కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణనపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద, రాజ్యాధికారం అంతా కొందరికి వస్తుందని రాహుల్ కులగణన ప్రతిపాదన తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన చేస్తున్నామని.. ఇది చారిత్రాత్మక తీర్మానమని భట్టి వెల్లడించారు. రాష్ట్రంలో వున్న అన్ని వర్గాల వివరాలు సేకరిస్తామని.. ప్రతి ఇంటిని , కులాలను, ఆర్ధిక స్థితిగతులను సర్వే చేస్తామని విక్రమార్క చెప్పారు. 

సామాజిక, ఆర్ధిక, రాజకీయ మార్పులకు పునాదిగా కులగణన వుంటుందని .. మార్పు కోరుకునే వాళ్లు మద్ధతు ఇవ్వాలని భట్టి కోరారు. కేటీఆర్, కడియం శ్రీహరి కన్‌ఫ్యూజన్‌లో వున్నారని .. తీర్మానం క్లియర్‌గా వుందని విక్రమార్క వెల్లడించారు. కేటీఆర్, కడియం రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారని.. ప్రజలను కన్‌ఫ్యూజ్ చేయొద్దని ఆయన సూచించారు. జనాభా దామాషా ప్రకారం సంపదను పంచాలని.. సంపద, రాజకీయం, విద్య, అధికారం కొన్నిచోట్ల మాత్రమే కేంద్రీకృతమై వుందన్నారు. సర్వే అయిపోయాక అందరి ఆలోచనలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

Latest Videos

అంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం కట్టుబడి పనిచేసేది కాంగ్రెస్ పార్టీయేనననారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి రిజర్వేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. శాస్త్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే వుంటుందని , సమగ్ర కుటుంబ సర్వే సభకు ఇచ్చారా అని ప్రశ్నించారు. భేషజాలాలకు పోకుండా సూచనలు ఇవ్వాలని, తీర్మానానికి చట్టబద్ధత లేదన్నట్లు చేయొద్దన్నారు. 

click me!