కాంగ్రెస్ పార్టీలో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి శుక్రవారంనాడు చేరారు. పట్నం సునీతా మహేందర్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.
undefined
ఇటీవలనే తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి , ఆమె భర్త మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ కారణంగానే భారత రాష్ట్ర సమితిని వీడిని కాంగ్రెస్ పార్టీలో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చేరారు. ఇవాళ ఉదయమే పట్నం సునీతా మహేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు.
జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ మేయర్ పదవి బొంతు రామ్మోహన్ కు దక్కింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ బొంతు రామ్మోహన్ తన సతీమణిని కార్పోరేటర్ గా గెలిపించుకున్నాడు. అయితే రెండో దఫా బొంతు రామ్మోహన్ కు కాకుండా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ నాయకత్వం మేయర్ పదవిని కట్టబెట్టింది.
also read:ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ టిక్కెట్టును బొంతు రామ్మోహన్ ఆశించారు. కానీ, పార్టీ నాయకత్వం ఉప్పల్ టిక్కెట్టును రామ్మోహన్ కు కూడ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి కొత్త అభ్యర్ధిని బరిలోకి దింపింది. దీంతో బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
also read:అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి: మల్కాజిగిరి నుండి పోటీ?
సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు వరకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వీరంతా అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలిశారు.