బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోవిడ్ బారిన పడ్డారు. రెండు రోజులుగా అస్వస్వతతో ఉన్న ఆయన పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది.
హైదరాబాద్ : BJP MLA Raja Singhకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా covid 19 పాజిటివ్ గా తేలింది. అంతకుముందు ఆయన బేగంబజార్ డివిజన్లోని సిసి రోడ్డు, స్టోమ్ వాటర్ పైప్ లైన్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 17న రాజాసింగ్ హీరోయిన్ సాయి పల్లవిపై విరుచుకుపడ్డారు. విరాటపర్వం మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా సాయిపల్లవి గోసంరక్షకుల దాడులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. కశ్మీర్ ఫైల్స్ పై సాయి పల్లవి చేసిన కామెంట్ సర్వత్రా కాక రేపుతున్నాయి. సాయిపల్లవిపై గో సంరక్షకులు, బజరంగ్ దళ్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని, జనం తిరగబడి కొడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని రాజా సింగ్ పేర్కొన్నారు.
undefined
BJP MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊహించని షాక్.. మత విశ్వాసాలను కించపరంటూ కేసు
కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని.. వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయిపల్లవికి లేదు అని అన్నారు. తెలంగాణ, ఏపీ అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒకరిని అరెస్టు చేస్తే ఇంకెవరూ హిందువుల జోలికి రారు అని పేర్కొన్నారు. మూవీ పాపులర్ కావాలని, తాము పాపులర్ కావాలని కొంతమంది నటీనటులు.. డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
సాయి పల్లవి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అనుబంధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఇస్లాం పైన కామెంట్ చేసే దమ్ముందా మీలో? క్రిస్టియన్స్ పైన కామెంట్ చేస్తారా? మీకు ఆ దమ్ము లేదు. మీకు దమ్ముంటే ముస్లింలపైనా, క్రిస్టియన్స్ పైనా కామెంట్స్ చేయండి. అంతే కానీ ఏం చెయ్యరు కదా అని హిందువులపై కామెంట్స్ చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు రాజాసింగ్. తక్షణమే సాయి పల్లవిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.