హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ హెచ్చరిక...

By SumaBala Bukka  |  First Published Jun 21, 2022, 6:43 AM IST

జంటనగరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప బైటికి రాకూడదని.. జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజల్ని అప్రమత్తం చేశారు.


హైదరాబాద్ : Monsoon ప్రారంభం కావడంతో Hyderabad మహానగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి మేయర్ Gadwal Vijayalakshmi తెలిపారు. నగరంలో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆమె సూచించారు. అనవసరంగా బయట తిరిగి ఇబ్బందులకు గురి కావద్దని పేర్కొన్నారు. వర్షాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే GHMC ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం నెంబర్ 040-21111111ను సంప్రదించాలని కోరారు.

జంటనగరాల్లో భారీ వర్షం…
జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. షేక్పేట్, గోల్కొండ, టోలిచౌకి,  మెహదీపట్నం, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్, మారేడ్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, భార్కస్ , యాకుత్పురా, బహదూర్ పురా, చేవెళ్ల, నాగారం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో జిహెచ్ఎంసి డిఆర్ఎస్ బృందాలను అప్రమత్తం చేసింది.

Latest Videos

undefined

హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం: మైనర్ బాలిక కిడ్నాప్, రేప్,

ఇక, హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఆదివారం నాడు మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, బోయిన్పల్లి , మారేడ్పల్లి, బేగంపేట్,  అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్, అమీర్పేట్ లో వర్షం  కురిసింది,

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే వర్షాలను తీసుకువచ్చాయి. ఈనెల 15న రాత్రి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 14న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కానీ, వర్షపాతం నమోదు కాలేదు.ఈ నెల 17న ఉదయం నుండి వర్షం ప్రారంభమైంది. గంటకు పైగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని పాతబస్తీలోని ఛత్రినాక, shiva ganga nagar, శివాజీ నగర్ లో వరద నీరు రోడ్లపై పొంగి పొర్లింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండలో కూడా వర్షం నీరు రోడ్లపై చేరడంతోట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. సింగపూర్ టౌన్షిప్ దగ్గర 5.6 సెం.మీ వర్షం నమోదయింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కింది గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

click me!