సిఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతులు చించేసిన రాజాసింగ్: అసెంబ్లీలో ఆందోళన

By telugu teamFirst Published Mar 16, 2020, 2:20 PM IST
Highlights

తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతులను బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చించేశారు. సిఏఏ వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా తాను రాజీనామా చేసి తెలంగాణ విడిచి వెళ్లిపోతానని రాజాసింగ్ అన్నారు.

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ఆమోదించడంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళనకు దిగారు. శాసనసభలో స్పీకర్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తెలంగాణ శాసనసభ సోమవారం సీఏఏ వ్యతిరేక బిల్లును ఆమోదించింది. 

అంతకు ముందు చర్చలో పాల్గొంటూ రాజాసింగ్ సిఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతులను చించేశారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం లేదని ఆయన అన్నారు. సిఏఏ వల్ల ఓ వ్యక్తికి ఇబ్బంది కలిగినా తాను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, తెలంగాణ వదిలి వెళ్లిపోతానని ఆయన అన్నారు. 

Also Read: దేశ ద్రోహులమౌతామా ?.. సీఏఏ పై అసెంబ్లీలో కేసీఆర్

ప్రజలకు పౌరసత్వం ఇవ్వడానికి కేంద్రం సీఏఏని తెచ్చిందని, దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. సీఏఏపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హిందూ ముస్లిములు ఎవరైనా కావచ్చు, వారందరికీ పౌరసత్వం ఇవ్వడానికి సీఏఏ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వంటి పేర్లున్నాయని, వాటికి సిఏఏతో సంబంధం లేదని ఆయన అన్నారు. 

సిఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదిస్తూ సీఏఏను అమలు చేయకూడదని కేంద్రాన్నికోరాలని నిర్ణయించింది. దీన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు.

click me!