హాజీపూర్ ఘటన... బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం

By telugu news teamFirst Published Mar 16, 2020, 12:23 PM IST
Highlights

శ్రీనివాస్ రెడ్డి తొలి నేరం 2015లో హజీపూర్ లో చేసినట్లు తెలిపారు. ఓ 14 బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి బావిలో పాతిపెట్టిన విషయం బయటపడడంతో హజీపూర్ లో అతను చేసిన మూడు నేరాలు వెలుగు చూశాయి. 

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసుకు సంబంధించి ఓ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన.. ఓ బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. నేడు ఆమె చెట్టుకు ఉరివేసుకుంటుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి భూ తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.

Also Read దిశకు న్యాయం చేశారు... మరి మా కూతుళ్లకు న్యాయమేది?...

కాగా... గతేడాది హాజీపూర్ లో కొందరు బాలికలు వరసగా హత్యాచారాలకు గురయ్యారు. కాగా.. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి ఇటీవల మరణ శిక్ష కూడా విధించారు.  ఇద్దరు మైనర్ బాలికలను రేప్ చేసి, హత్య చేసిన కేసుల్లో మరణశిక్ష, ఓ మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేసిన కేసులో జీవిత ఖైదు విధించారు. అయితే.. ఉరిశిక్ష మాత్రం ఇంకా అమలు కాలేదు.

కాగా.. శ్రీనివాస్ రెడ్డి తొలి నేరం 2015లో హజీపూర్ లో చేసినట్లు తెలిపారు. ఓ 14 బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి బావిలో పాతిపెట్టిన విషయం బయటపడడంతో హజీపూర్ లో అతను చేసిన మూడు నేరాలు వెలుగు చూశాయి. ఈ బాలికపై శ్రీనివాస్ రెడ్డి చేసిన అత్యాచారం, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు హజీపూర్ లో అదృశ్యమైన ఇద్దరు బాలికలకు సంబంధించిన విషయం తెలిసింది. 

దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో... శ్రీనివాస్ రెడ్డిని కూడా కఠినంగా శిక్షించాలంటూ బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఈ కేసును వేగవంతం చేశారు. ఎట్టకేలకు అతనికి కోర్టులో ఉరిశిక్ష విధించారు. తాజాగా... చనిపోయిన ముగ్గురు బాలికల్లో.. ఒక బాలిక తల్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో ... మరోసారి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. ఆమె ఎందుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందో తెలియాల్సి ఉంది.

click me!