రియల్ శ్రీమంతుడితో కేటీఆర్... ట్విట్టర్ లో ఫోటోలు

Published : Mar 16, 2020, 01:14 PM IST
రియల్ శ్రీమంతుడితో కేటీఆర్... ట్విట్టర్ లో ఫోటోలు

సారాంశం

స్వగ్రామం కోసం నరసింహారెడ్డి పడుతున్న తాపత్రయాన్ని కేటీఆర్ అభినందించారు. కాగా.. ఆయన తో భీటీ అయిన విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో మహేష్.. తన స్వగ్రామం కోసం రూ.కోట్లు ఖర్చు పెడతాడు. కనీస అవసరాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న తన గ్రామస్థుల అన్ని అవసరాలు తీరుస్తాడు. అయితే... అందులో మహేష్ రీల్ శ్రీమంతుడు అయితే... ఇక్కడ నర్సింహారెడ్డి.. రియల్  శ్రీమంతుడు.

Also Read హాజీపూర్ ఘటన... బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం..

తన స్వగ్రామం కోసం కష్టపడుతున్న దమ్మన్నపేట కు చెందిన శ్రీమంతుడు కె. నరసింహారెడ్డితో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాలపై చర్చించారు. స్వగ్రామం కోసం నరసింహారెడ్డి పడుతున్న తాపత్రయాన్ని కేటీఆర్ అభినందించారు. కాగా.. ఆయన తో భీటీ అయిన విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

 

ఆయనను కలిసినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన చాలా మందికి స్ఫూర్తి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కాగా... రియల్ శ్రీమంతుడితో భేటీ అయిన వారిలో కేటీఆర్ తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

వరంగల్ జిల్లాలోని దమ్మన్నపేట్‌కు చెందిన కె.నరసింహారెడ్డి తన గ్రామాభివృద్ధి నిమిత్తం రూ.25 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా దీన్ని వినియోగించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu