జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం నేతల పిల్లలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్:Jubilee hills గ్యాంగ్ రేప్ కేసులో MIM నేతల పిల్లలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని BJP ఎమ్మెల్యే Raghunandan raoఆరోపించారు.
సోమవారం నాడు రఘునందన్ రావు BJP కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో హోంమంత్రి మనమడు ఉన్నాడని తాను చెప్పలేదన్నారు. ఎంఐఎంకు చెందిన MLA కొడుకు ఉన్నాడని తాను చెప్పానని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి మైనర్ బాలిక ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఎమ్మెల్యే వివరించారు. తాను ఈ ఫోటోలు విడుదల చేయకముందే అన్ని టీవీల్లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. బాధితురాలి పేరును కూడా తాను ప్రస్తావించలేదన్నారు.
undefined
గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తాను మాట్లాడానని రఘునందన్ రావు చెప్పారు. ఈ విషయమై తాను ఏం తప్పు చేశానని Congress, TRS నేతలు మాట్లాడుతన్నారని ప్రశ్నించారు. కేసులు ఎదుర్కోవడం తనకు కొత్తకాదన్నారు. ఈ విషయం వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కు కూడా తెలుసునని చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి తాను ఫోటోలు విడుదల చేసని విషయంలో తన తప్పుంటే తనపై కేసు పెట్టుకోవాలని రఘునందన్ రావు పోలీసులను కోరారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని ఆందోళన చేయాలని తనను విమర్శిస్తున్నవారికి సూచించారు. బీజేపీలో చేరిన తర్వాత తాను ఏ కేసులు కూడా వాదించలేదన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ లు కలిసి తన మీదకు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు.