సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌పై ఇప్పటికీ పలు వివాదాలు, సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యంగా భూమి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది. తెలంగాణ బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి ధరణి పోర్టల్, రాష్ట్ర వ్యవసాయ భూములకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాల భూరికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల వివరాలు దుర్వినియోగం అయ్యాయనీ, ఈ వివరాలన్ని విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళలపైనే రాజకీయ పార్టీల నజర్ ఎందుకు?
undefined
ధరణి పోర్టల్, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆమె సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు చేశారు. "రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటూ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని లోపాలతో రాష్ట్రంలోని ప్రజలు... వారిలోనూ ముఖ్యంగా రైతులు ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నరు" అని ట్విట్ చేశారు. దానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయంటూ రాసుకొచ్చారు. మీడియా ద్వారా ఇటీవల బయటకు వచ్చిన పలు వివరాలు బయటపెట్టాయని పేర్కొన్నారు. "మీడియా రాష్ట్ర సర్కారు దివాలాకోరు పనితీరును బయటపెట్టాయి. అదేమిటంటే... తెలంగాణ రైతుల భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్నీ దివాళా బాటపట్టిన టెర్రాసిస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతుల్లో కేసీఆర్ సర్కారు పెట్టింది" అంటూ ట్వీట్ చేశారు.
Also Read: సింగరేణి కాలనీ తరహాలో మరో ఘటన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..
అలాగే, ఈ టెర్రాసిస్ గతంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు టెర్రాసిస్‌లో సగానికి పైగా వాటాను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌నకు ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసింది. ఆ విధంగా మన తెలంగాణ భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లయింది. దాదాపు 70 లక్షల మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర ఎకరాల భూముల రికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల ఉన్నయంటూ పేర్కొన్నారు. ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో పడి ఆ భూముల డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే పరిస్థితి ఏమిటి? ఏవైనా సమస్యలు తలెత్తితే, అప్పుడు ఏకైక ఆధారమైన మాన్యువల్ రికార్డులను పరిరక్షించే చర్యల్ని కూడా సర్కారు చేపట్టడం లేదు అంటూ విమర్శించారు.
Also Read: కరోనా పంజా.. ఒక్కరోజే 2,796 మంది మృతి
ప్రజల ఆస్తులైన సర్కారు భూములు, రైతుల భూముల డేటా భద్రత విషయంలో ఇంత దారుణమైన నిర్లక్ష్యాన్ని తెలంగాణ సర్కారు ప్రదర్శిస్తోందన్నారు. పైగా ఇందుకు సంబంధించిన సమాచారం అడిగిన సమాచార కార్యకర్తలకు సైతం సరైన జవాబు ఇచ్చే దిక్కు లేదని విమర్శించారు. భూముల ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ సర్కారును నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ప్రస్తుతం రాములమ్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య