జగిత్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం... ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి

By Arun Kumar PFirst Published Dec 5, 2021, 2:05 PM IST
Highlights

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృత్యువాతపడగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. 

జగిత్యాల: ఇద్దరు చిన్నారులతో సహా ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఆర్టిసి బస్సు- ఇన్నోవా కారు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కోరుట్ల మండలం బిలాల్ పూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో హైదరాబాద్ కు వెళ్లి తిరుగుపయనం అయ్యారు. అయితే మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతారనగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. కోరుట్లకు కొద్దిదూరంలోని మోహన్ రావు పేట్ గ్రామ శివారు వద్ద వేగంగా వెళుతూ ఎదురుగా వచ్చిన ఆర్టిసి బస్సును ఢీకొట్టింది.  

వీడియో

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సాజిద్ అలీతో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతావారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.   

read more  కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... 15మందికి తీవ్ర గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. 

ఇక కరీంనగర్ జిల్లాలోనే శనివారం రాత్రి మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఆటో రోడ్డు ప్రమాదానికి గురయి 15మంది తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. 

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాకుచెందిన కొందరు ఓ ఆటోలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఉదయమే ఆలయానికి చేరుకుని దర్శనాది కార్యాక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రమాదానికి గురయ్యారు.  

వీరు ప్రయాణిస్తున్న ఆటోను karimnagar district మనకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ ఢీ కొట్టింది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటో తుక్కుతుక్కయ్యింది. అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదసమయంలో ఆటోలో వున్న 15 మంది తీవ్రంగా గాయపడగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది.  

  

   

click me!