అనుచరులతో కొల్లాపూర్‌లో జూపల్లి భేటీ: కృష్ణారావుకు డీకే అరుణ ఫోన్

By narsimha lode  |  First Published Apr 11, 2023, 11:17 AM IST

మాజీ  మంత్రి  జూపల్లి  కృష్ణారావు  ఇవాళ  అనుచరులతో  కొల్లాపూర్ లో  సమావేశమయ్యారు.  ఈ  సమావేశం తర్వాత  భవిష్యత్తు  కార్యాచరణను  ప్రకటించనున్నారు. 


నాగర్ కర్నూల్:మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావు  మంగళవారంనాడు  కొల్లాపూర్ లో  తన అనుచరులతో  సమావేశమయ్యారు.భవిష్యత్తు  కార్యాచరణపై జూపల్లి  కృష్ణారావు ప్రకటన  చేసే అవకాశం ఉంది.  మరో వైపు  బీజేపీ  నేత  డీకే  అరుణ  మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావుకు  ఫోన్  చేసినట్టుగా  సమాచారం.

 ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో  ఈ నెల 9వ తేదీన  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన  ఆత్మీయసమ్మేళనానికి  జైపల్లి  కృష్ణారావు హాజరయ్యారు. దీంతో  జూపల్లి  కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై  బీఆర్ఎస్  నాయకత్వం  ఈ నెల 13న  సస్పెన్షన్ వేటు వేసింది 
గత కొంతకాలంగా  బీఆర్ఎస్ నాయకత్వంపై  జూపల్లి  కృష్ణారావు తీవ్ర అసంతృప్తితో  ఉన్నారు.  జూపల్లి  కృష్ణారావు పార్టీ మారుతారనే  ప్రచారం కూడా సాగింది.  అయితే  జూపల్లి  కృష్ణారావు మాత్రం  ఎలాంటి  నిర్ణయం తీసుకోలేదు.  నిన్న  బీఆర్ఎస్  నాయకత్వం  సస్పెన్షన్ వేటు  వేయడంతో  ఇవాళ  అనుచచరులతో  జూపల్లి  కృష్ణారావు సమావేశమయ్యారు. 

Latest Videos

undefined

  జూపల్లి  కృష్ణారావుకు  బీజేపీ  నేతలు  ఫోన్  చేసినట్టుగా  ప్రచారం  సాగుతుంది.  బీఆర్ఎస్  పార్టీ  సస్పెన్షన్ వేటు  వేయడంతో  కాంగ్రెస్, బీజేపీలలో  ఏదో  ఒక  పార్టీలో  జూపల్లి  కృష్ణారావు   చేరుతారని  ప్రచారం  సాగుతుంది. అయితే  ఈ విషయమై  జూపల్లి  కృష్ణారావు  నుండి  ఎలాంటి  స్పష్టత రాలేదు.  అయితే   పార్టీలో  చేరాలని  బీజేపీ  నేతలు కొందరు  జూపల్లి  కృష్ణారావుకు  ఆహ్వానం పంపారని  ప్రచారం సాగుతుంది.  మాజీ మంత్రి డీకే  అరుణ  మాజీ మంత్రి జూపల్లి  కృష్ణారావు ఫోన్   చేసినట్టుగా  ప్రచారం  సాగుతుంది. కలిసి పనిచేద్దామని డీకే అరుణ  జూపల్లి  కృష్ణారావును  కోరినట్టుగా  ప్రచారం సాగుతుంది. అయితే కార్యకర్తలతో  చర్చించి  నిర్ణయం తీసుకుంటానని  జూపల్లి  కృష్ణారావు  డీకే అరుణకు  చెప్పారని  జూపల్లి  కృష్ణారావు  వర్గీయుల్లో  ప్రచారంలో  ఉంది. 

also read:సంచలన నిర్ణయాలకు కేరాఫ్ జూపల్లి: నాడు కాంగ్రెస్‌కు , నేడు బీఆర్ఎస్‌కు దూరం

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  డీకే అరుణ,  జూపల్లి కృష్ణారావులు  కాంగ్రెస్ పార్టీలో  ఉన్నారు. ఉమ్మడి మహబూబ్  నగర్ జిల్లా  నుండి  వీరిద్దరికి  కేబినెట్ లో  చోటు దక్కింది.   రోశయ్య  సీఎంగా  ఉణ్న సమయంలో  కేబినెట్  పునర్వవ్యస్తీకరణలో  వీరిద్దరికి  చోటు దక్కింది. అయితే  జూపల్లి  కృష్ణారావుకు దేవాదాయశాఖ కేటాయించారు.ఈ శాఖపై  జూపల్లి  కృష్ణారావు  అసంతృప్తితో  ఉన్నారని  అప్పట్లో  ప్రచారం సాగింది. అదే  సమయంలో  తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా జూపల్లి  కృష్ణారావు పాదయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గద్వాల నియోజకవర్గంలో  పాదయాత్ర ప్రవేశించే సమయంలో  జూపల్లి  కృష్ణారావును అరెస్ట్  చేశారు  పోలీసులు. ఆ సమయంలో  డికె అరుణ  మంత్రిగా  ఉన్నారు. అయితే  ప్రస్తుతం  మారిన  రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డీకే అరుణ  బీజేపీలో  ఉన్నారు.  జూపల్లి కృష్ణారావు  బీఆర్ఎస్ సస్పెన్షన్  వేటేసింది.

also read:అనుచరులతో రేపు జూపల్లి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

ఇవాళ  అనుచరులతో  జూపల్లి  కృష్ణారావు  సమావేశమయ్యారు.  ఈ సమయంలో  బీజేపీ నేత  డీకే అరుణ  జూపల్లి  కృష్ణారావుకు  ఫోన్  చేయడం రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు  పలువురు  కాంగ్రెస్ నేతలు  కూడా  మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావుతో  టచ్ లో  ఉన్నారని సమాచారం. 
 

click me!