దళిత బంధు అమలు కోరుతూ ఈ నెల 9న బీజేపీ ఆందోళనలు

By narsimha lodeFirst Published Nov 5, 2021, 4:53 PM IST
Highlights

దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఈ పథకాన్ని ఎన్నికల వరకు ఈసీ నిలిపివేసింది.

హైదరాబాద్: Dalitha bandhuను వెంటనే అమలు చేయాలని  డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలనిBjp నిర్ణయం తీసుకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో  దళిత బంధును ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన Election Commission ఉప ఎన్నికలు ముగిసే వరకు దళిత బంధును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

also read:టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

అయితే గత మాసం 25వ తేదీన జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో Kcr కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధును ఎన్నికల సంఘం నవంంబర్ 4వ తేదీ వరకే నిలుపుదల చేస్తోందన్నారు. నవంబర్ 4  తర్వాత ఈ పథకాన్ని ఆపడం ఈసీకి సాధ్యమా అని ప్రశ్నించార. నవంబర్ 4 వ తేదీ తర్వాత దళితబంధును కొనసాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అయితే దళిత బంధును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని  బీజేపీ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం హుజూరాబాద్ తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో దళిత బంధును అమలు చేస్తున్నారు. 

ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని  శాలపల్లి గ్రామంలో కేసీఆర్ ప్రారంభించారు.  రైతు బంధు పథకాన్ని  కూడా ఇదే గ్రామం నుండి కేసీఆర్ ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ గ్రామంలో బీజేపీకే అధిక ఓట్లు వచ్చాయి.

Huzurabad bypoll లో దళిత బంధు నిలిచిపోవడానికి బీజేపీ, ఈటల రాజేందర్ కారణమని ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారాన్ని కూడ ఓటర్లు పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కమలనాథులు గుర్తు చేస్తున్నారు.దళిత బంధు పథకాన్ని  అమలు చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. మరోవైపు ఈ నెల 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్‌తో ప్రజల్లోకి వెళ్లాలని కూడా ఆ పార్టీ నిర్ణయం భావిస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ సర్కార్ పై మరింత దూకుడుతో వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం కోసం  Trs, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నించాయి.  అయితే చివరకు బీజేపీ అభ్యర్ధి  Etela Rajender విజయం సాధించాడు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దళిత బంధు పథకం విజయాన్ని అందించలేకపోయిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకాన్ని అడ్డుపెట్టుకొని తమపై టీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేశారని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని నవంబర్ 4 నుండే అమలు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సమయంలో వచ్చిన లోటుపాట్లను సరిదిద్దుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

click me!