హైద్రాబాద్‌లో జంట హత్యలు, సైకో కిల్లర్ ఖదీర్ అరెస్ట్: సీపీ అంజనీకుమార్

By narsimha lodeFirst Published Nov 5, 2021, 2:47 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలోని హబీబ్ నగర్, నాంపల్లిలో జంట హత్యలకు కారణమైన ఖదీర్ అనే సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: Hyderabad నగరంలోని Habib Nagar,  నాంపల్లి పరిధిలో ఇద్దరిని హత్య చేసిన సైకో కిల్లర్ ఖదీర్ ను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ Anjani Kumar తెలిపారు.శుక్రవారం నాడు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు.కర్ణాటక బీదర్ కు చెందిన Khadir అనే వ్యక్తి సైకో కిల్లర్ గా మారి హత్యలకు పాల్పడుతున్నారని సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఖదీర్ మానసికస్థితి సరిగా లేదన్నారు. మత్తులో హత్యలు చేస్తున్నాడని సీపీ వివరించారు. ఖదీర్ పై పీడీయాక్ట్ నమోదు చేశామన్నారు.

also read:తమిళనాడు-పుదుచ్చేరి సరిహద్దులో విషాదం: బాణసంచా పేలి తండ్రీ, కొడుకు సజీవ దహనం

ఈ నెల 1వ తేదీన ఖదీర్  నాంపల్లి పేవ్‌మెంట్ పై ఉన్న Begggers ను ఖదీర్ రాళ్లతో కొట్టి చంపాడు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్ అల్హమ్దులిల్లా రోడ్డు సమీపంలోని పేవ్‌మెంట్ పై పడుకొన్న బెగ్గర్ ను ఖదీర్ కొట్టి చంపాడు. ఈ మేరకు పోలీసులు సీసీటీవి దృశ్యాలను గుర్తించారు.  రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాయిని తీసుకొని కొట్టి చంపాడని సీపీ వివరించారు.

ఈ హత్య చేసిన కొద్ది గంటల్లోనే నిందితుడు ఖదీర్ నాంపల్లిలోని దర్గా యూసుఫైన్‌కు కొంచెం దూరంలో పేవ్‌మెంట్ పై నిద్రపోతున్న వ్యక్తిని రాయితో కొట్టి చంపాడు. ఈ రెండు మృతదేహలను పోలీసులు  ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 

మృతుల శరీరబాగాలపై రాయితో బలంగా కొట్టిన ఆనవాళ్లున్నాయని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. దీంతో పోలీసులు ఈ హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ఇద్దరిని హత్య చేయడానికి ముందు వారితో నిందితుడు కూర్చొని మాట్లాడారని సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు మృతుల జేబులను వెతికాడు. 

అయితే  నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. నగరంలోని గతంలో చోటు చేసుకొన్న హత్యలతో ఖదీర్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.పేవ్‌మెంట్ పై నిద్రిస్తున్న వారిలో కొందరు గతంలో హత్యకు గురయ్యారు.  వీరిలో ఎక్కువ మంది వ్యక్తుల మధ్య వ్యక్తిగత లేదా చిన్న ఆర్ధిక సమస్యల కారణంగా హత్యలు చోటు చేసుకొన్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన జరిగిన వెంటనే సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఖదీర్ ను అదుపులోకి తీసుకొన్నామని సీపీ తెలిపారు. నిందితుడిని విచారణ సమయంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించామన్నారు. మరో వైపు నిందితుడు మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డాడని తాము గుర్తించామని సీపీ చెప్పారు. మత్తులో ఉన్న సమయంలో ఈ హత్యలు చేశాడని అంజనీకుమార్ తెలిపారు.

నగరంలో నేరాల అదుపునకు అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నామని సీపీ చెప్పారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు దోహదం చేశాయని ఆయన చెప్పారు. నిందితుడు రెండు హత్యలను నాలుగు గంటల వ్యవధిలో చేశాడని సీపీ తెలిపారు. గతంలో ఓ బెగ్గర్ ను హత్య చేసిన కేసులో  ఖదీర్ 16 నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడని సీపీ వివరించారు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మారలేదని ఈ హత్యల ద్వారా తేలిందని సీపీ చెప్పారు.

click me!