హైద్రాబాద్‌‌లో యువతి బట్టలు మార్చుకొంటుండగా వీడియో: ముగ్గురు అరెస్ట్

By narsimha lodeFirst Published Nov 5, 2021, 3:28 PM IST
Highlights


హైద్రాబాద్‌లోని ఓ బట్టల దుకాణంలోని ట్రయల్ రూమ్ లో యువతి బట్టలు మార్చుకొంటున్న సమయంలో సెల్‌ఫోన్  ద్వారా ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరితో పాటు షాప్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: Hyderabad నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఓ బట్టల దుకాణంలోని Trial Room లో యువతి బట్టలు మార్చుకొంటున్న సమయంలో ఇద్దరు యువకులు Cell phone తో  ఈ దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో  ఇద్దరు యువకులతో పాటు వస్త్ర దుకాణం మేనేజర్ ను jubilee hills  పోలీసులు అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలోని ట్రయల్ రూమ్ లో యువతి డ్రెస్ కొనుగోలు చేసేందుకు శుక్రవారం నాడు వచ్చింది., డ్రెస్ తనకు సరిపోతోందో లేదో చూసుకొనేందుకు ట్రయల్ రూమ్ కు వెళ్లింది. ఈ ట్రయల్ రూమ్ కు పక్కనే పురుషుల ట్రయల్ రూమ్ ఉంది. ట్రయల్ రూమ్ పైన ఉన్న ఖాళీ ప్రదేశం నుండి ఇద్దరు యువకులు యువతి డ్రెస్ మార్చుకొంటున్న దృశ్యాలను తమ ఫోన్ లో రికార్డు చేయడం ప్రారంభించారు.ఈ విషయాన్ని గుర్తించిన యువతి అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ షోరూమ్‌కి వచ్చి నిందితుల నుండి మొబైల్ ను స్వాధీనం చేసుకొని వీడియోను డిలీట్ చేశారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు షోరూమ్ మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షోరూమ్‌కి దుస్తులు కొనుగోలు చేసేందుకు నిందితులు ఇద్దరు వచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. 

షోరూమ్‌లలోని ట్రయల్ రూమ్స్ లో మహిళలు బట్టలు మార్చుకొంటున్న సమయంలో రికార్డు చేస్తే రికార్డు చేసిన వారితో పాటు షోరూమ్ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

గతంలో హైద్రాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో కూడా వాష్‌రూమ్ లో మొబైల్ ఫోన్ ద్వారా రికార్డు చేసిన ఘటన చోటు చేసకొంది. ఈ హోటల్ లో పనిచేసే హౌస్ కీపీంగ్ సిబ్బంది ఈ ఫోన్ ను ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. వాష్ రూమ్ రూఫ్ పైన మొబైల్ ను పెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు

షోరూమ్స్ లలోని ట్రయల్ రూమ్స్, హోటల్స్ లోని వాష్ రూమ్‌లలో కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ట్రయల్స్ రూమ్స్ తో పాటు వాష్ రూమ్‌లలో రహస్యంగా కెమెరాలను ఉపయోగించి రికార్డు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని  పోలీసులు తెలిపారు.

also read:హైద్రాబాద్‌లో జంట హత్యలు, సైకో కిల్లర్ ఖదీర్ అరెస్ట్: సీపీ అంజనీకుమార్

నిందితులతో పాటు నిందితులకు సహకరించిన వారితో పాటు ఆయా షోరూమ్స్, హోటల్స్ నిర్వాహకులను కూడా బాధ్యులను చేసి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తమ షోరూమ్స్, హోటల్స్ కు వచ్చే కస్టమర్స్ కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్రయల్స్ రూమ్స్, వాష్ రూమ్ ను ఉపయోగించే వారి ప్రైవసీకి సంబంధించి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని పోలీసులు చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  కేసులు తప్పవని హైద్రాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు.

click me!