టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కే... అందుకే బలం లేకున్నా ఎమ్మెల్సీ బరిలో: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Nov 23, 2021, 12:15 PM IST
Highlights

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా బరిలో దిగడం వెనక భారీ వ్యూహమే దాగివున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. 

హైదరాబాద్: స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విధులే కాదు నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సొంత పార్టీ ప్రజాప్రతినిధులో అసంతృప్తితో వున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ కు కలిసివస్తుందని అన్నారు. 

MLC Elections లో కాంగ్రెస్ ఫోటీచేయడం వెనక పెద్దవ్యూహమే దాగివుందని sangareddy mla jaggareddy పేర్కొన్నారు. ఎలాగూ congres party నుండి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమకే ఓటేస్తారని... అంతేకాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు కూడా తమకు వస్తాయని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. trs government పై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నారని... వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి షాకిస్తూ తమకే ఓటేస్తారన్నారు.  

టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కూడా తమకు మళ్లుతాయని బలంగా నమ్ముతున్నామని... అందువల్లే బలం  లేకపోయినా ఫోటీ చేస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. మెదక్‌  జిల్లా నుంచి తన భార్య నిర్మల బరిలో నిలుస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. 

read more  మళ్లీ ఎమ్మెల్సీ బరిలో కవిత.. మద్యాహ్నం నిజామాబాద్ లో నామినేషన్ దాఖలు...

ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించిన టిపిసిసి అందుకోసం రెండు స్థానాలను ఎంచుకుంది. ఖమ్మంతో పాటు మెదక్ జిల్లాలో పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్ ఈ రెండు జిల్లాల్లో అభ్యర్ధులను కూడా నిర్ణయించి బీ ఫారాలను అందించింది.  

khammam జిల్లాలో రాయల్ నాగేశ్వర్ రావును congress పార్టీ బరిలోకి దింపింది.  ఉమ్మడి medak  జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి nirmala Jagga reddy ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. వీరిద్దరికి TPCC నాయకత్వం బీ ఫారాలను అందించింది.

Telangana Local body Mlc elections ఎన్నికలు వచ్చే నెల (డిసెంబర్) 10వ తేదీన జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా చివరిదశకు చేరుకుంది. 

read more  ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు దాఖలు

అయితే nalgonda స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఈ ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది.

గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో  ఆయన  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.  దీంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణిని బరిలోకి దింపారు. అయితే ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణిపై టీఆర్ఎస్ అభ్యర్ధి తేర చిన్నపరెడ్డి విజయం సాధించారు. 

 

click me!