
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి (MLC Venkata Rami Reddy) తెలంగాణ హైకోర్టు కోర్టు (Telangana High court) ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి సింగిల్ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
దీనిపై స్పందించిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. వెంకట్రామిరెడ్డితో భేషరతుగా క్షమాపణలు చెప్పిస్తామని.. స్టేట్‌మెంట్ నమోదు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇక, వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఓ సమావేశంలో.. వరి విత్తనాలు వేయవద్దని.. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకన్న పట్టించుకోబోమని వ్యాఖ్యానించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
Also read: వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్..
మరోవైపు.. వెంకట్రామిరెడ్డి రాజీనామా వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాలు చేస్తూ రీసెర్చ్ స్కాలర్స్ ఆర్ సుబేందర్ సింగ్, జె శంకర్‌లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడం, ఆయనను ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్టుగా ప్రకటించడం పూర్తి అయిపోవడంతో.. తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు.
ఇక, సిద్దిపేట కలెక్టర్ పదవికి ఇటీవల వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ సీఎస్ సోమేశ్ కుమార్‌కు రాజీనామా లేఖ పంపారు. దానిని ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్ తరఫున.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనకు సోమవారం సాయంత్రం ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఆయనతో పాటు టీఆర్‌ఎస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డిలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.