షేర్‌చాట్ లో పరిచయం... పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై అత్యాచారం..

By SumaBala Bukka  |  First Published Aug 15, 2023, 8:34 AM IST

షేర్ ఛాట్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు. 


హైదరాబాద్ : షేర్‌చాట్ యాప్‌లో స్నేహం చేసిన 26 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 35 ఏళ్ల వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నిందితుడు ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని వాగ్ధానం చేశాడు. కానీ ఆ తరువాత ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆమెను విడిచిపెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

హైదరాబాద్ మహిళపై అత్యాచారానికి సంబంధించిన వివరాలలోకి వెడితే...సౌదీ అరేబియాలో కూలీగా పనిచేస్తున్న నిందితుడు జూన్ 15న ఇండియాకు వచ్చాడు. నేరుగా హైదరాబాద్‌లో దిగి సికింద్రాబాద్ లాడ్జిలో గది తీసుకున్నాడు. అప్పటికే పరిచయం అయిన ఆ మహిళను కాంటాక్ట్ చేశాడు. తన గదికి రావాల్సిందిగా ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. 

Latest Videos

కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తులు.. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరణ

అలా వారిద్దరూ కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే, అతను ఆమెపై అత్యాచారం చేసాడు. ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఆ తరువాత ఆమెను విడిచిపెట్టి అతని స్వగ్రామమైన కరీంనగర్‌కు వెళ్లిపోయాడు. తరువాత కాంటాక్ట్ లో లేడు. 

కొద్ది రోజులకు ఫోన్ చేసి.. "సౌదీ అరేబియాకు తిరిగి వచ్చానని..ఆమెను వివాహం చేసుకోవడానికి ఆసక్తి లేదని ఆమెకు తెలిపాడు. అతను ఫోన్‌లో కూడా ఆమెతో అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడాడు" అని పోలీసులు తెలిపారు. దీంతో ఆ మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన తరువాత ఆమె అతనికి ఫోన్ చేసినప్పుడల్లా  తన తల్లి అనారోగ్యంతో ఉన్నదని.. బిజీగా ఉన్నానని ఆమెకు ఏదో ఒక సాకు చెబుతూనే ఉన్నాడు. తరువాత, అతను వివిధ కారణాలను చూపుతూ ఆమెనుండి తప్పించుకోవడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

బాధితురాలైన ఆ మహిళ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఓ హోటల్‌లో బస చేసింది. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

click me!