జాతీయ స్థాయి క్రీడాకారిణికి మంత్రి పేషి ఉద్యోగి వేధింపులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏం చేశారంటే?

Published : Aug 15, 2023, 05:41 AM ISTUpdated : Aug 15, 2023, 05:42 AM IST
జాతీయ స్థాయి క్రీడాకారిణికి మంత్రి పేషి ఉద్యోగి వేధింపులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏం చేశారంటే?

సారాంశం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో సురేందర్ అనే వ్యక్తి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణి ఇటీవలే మంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఆమె నెంబర్ అడిగి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు మెస్సేజీలతో వేధించడం ప్రారంభించాడు. విషయం మంత్రికి తెలియడంతో సురేందర్‌ను విధుల నుంచి తొలగించారు.  

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా సురేందర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణి అక్కడికి తన బంధువుతో కలిసి వచ్చింది. వారు మంత్రిని కలిసి వెళ్లిపోయారు. అయితే.. ఆ క్రీడాకారిణి అక్కడికి వచ్చినప్పుడు సురేందర్ ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు. వారు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. ఆమెకు అసభ్యకరమైన మెస్సేజీలు పెట్టడం ప్రారంభించాడు. ఆ క్రీడాకారిణి వయసు ఎంత అని అడగడం, ఆమె పర్సనల్ ఫొటోలు పెట్టాలని ఒత్తిడి చేయడం, పర్సనల్‌గా కలవాలని, మాట్లాడాలని సురేందర్ మెస్సేజీలు పెట్టాడు.

ఈ మెస్సేజీలు రావడంతో ఆ క్రీడాకారిణి ఖంగుతిన్నది. మంత్రి పేషీలో పని చేసే వ్యక్తి ఇంతలా దిగజారుతాడని అనుకోలేదు. ఆ మెస్సేజీ వేధింపులను ఆమె భరించలేకపోయింది. దీంతో ఆమె తనను మంత్రి వద్దకు తీసుకెళ్లిన బంధువుకు ఈ విషయం చెప్పింది.

Also Read: పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రూ. 5 లక్షల బీమా.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆ బంధువు వెంటనే అదే నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ అమ్మాయికి వల్గర్ మెస్సేజీలు పెడుతున్నావని? ఇంకా ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలతోనూ ఇలాగే వ్యవహరించావని తెలిసిందని నిలదీశాడు. అయితే.. ముందుగా సురేందర్ ఏమీ ఎరుగనట్టు నటించాడు. అలాంటిదేమీ లేదని బుకాయించబోయాడు. కానీ, తన వద్ద మెస్సేజీల వివరాలు ఉన్నాయని, ఆధారాలు ఉన్నాయని క్రీడాకారిణి బంధువు పక్కాగా మాట్లాడాడు. అంతేకాదు, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లుతానని వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో సురేందర్ దారిలోకి వచ్చాడు. తనను మన్నించాలని, తప్పు చేశానని వేడుకున్నాడు. ఈ విషయాన్ని మనసులోనే పెట్టుకోవాలని, మంత్రికి చెబితే తన ఉద్యోగం ఊడి రోడు మీద పడుతుందని అన్నాడు.

సురేందర్ రెడ్డి వ్యవహారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టి కి వెళ్లింది. దీంతో మారు ఆలోచించకుండా సురేందర్‌ను విధుల నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలగించేశారు.  ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే